Asianet News TeluguAsianet News Telugu

స్టార్ వైఫ్ అంటారు కానీ..స్టార్ హస్బెండ్ అని ఎందుకు అనరు..? మీరా రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరారాజ్ పుత్ కు ఓ ధర్మ సందేహం వచ్చింది. ఇంత వరకూ ఏ స్టార్ కు రాని  సందేహాన్ని ఆమె పబ్లిక్ గా వెల్లడించింది. అసలు ఆ డౌట్ కు ఆన్సర్ ఎవరు ఎలా చెపుతారో కూడా తెలియకుండా కన్ ఫ్యూజన్ లో పడేసింది. ఇంతకీ  ఆమెకు వచ్చిన డౌట్ ఏంటీ..?
 

Mira Rajput interesting Comments on Industry Relationships
Author
First Published Dec 4, 2022, 12:49 PM IST

ఇంట్లో నాన్న కాని, అన్నకాని. భర్త కాని స్టార్ అయిఉంటే..చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంటారు. స్టార్ కిడ్స్.. స్టార్ వైఫ్.. స్టార్ సన్స్ అని అంటుంటారు.. కాని స్టార్ హజ్బెండ్.. అని ఎందుకు అనరూ అని అనుమానం వచ్చింది. సినిమా హీరోల భార్య‌లు, పిల్ల‌లను త‌ర‌చూ స్టార్ వైఫ్, స్టార్ కిడ్ అని పిలుస్తుంటారు. మీడియాలో వాళ్ల గురించి చెప్పిన ప్ర‌తిసారి స్టార్ భార్య‌, స్టార్ కొడుకు, స్టార్ కూతురు అంటూ పిలుస్తుంటారు

బాలీవుడ్‌, టాలీవుడ్ అని కాదు అన్ని ఇండస్ట్రీలలో ఇదే కనిపిస్తుంటుంది. అయితే చాలా వరకూ ఇలా పిలిపించుకోవడం చాలా మందికి నచ్చదు. ఇక ఈ విధంగా  త‌న‌ను స్టార్ వైఫ్ అని పిలవ‌డంపై మీరా రాజ్‌పుత్ తాజాగా స్పందించింది. సోష‌ల్‌మీడియా స్టార్ జనిసె సెక్విరా మొద‌టి ఎపిసోడ్‌లో ఆమె మాట్లాడింది. కొన్ని ఇంట్రెస్టంగ్ విషయాలు వెల్లడించింది. 

స్టార్ భార్య అనే ప‌దాన్ని ముందు  నిషేధించాలి అంటుంది మీరా. ఎందుకంటే.. హీరోల పిల్ల‌ల‌కు స్టార్ కిడ్ అనడం అంద‌రికి న‌చ్చ‌దు. పైగా దానివ‌ల్ల వాళ్లపై నెపోటిజం ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  స్టార్ హ‌జ్బెండ్ అని ఎవ‌రూ అన‌రు. మ‌రి స్టార్ వైఫ్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు అని మీరా అంది. 

అయినా కూడా ఇప్ప‌టికీ స్టార్ కిడ్ అనే మాట వినిపిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్ లేదా సెల‌బ్రిటీని పెళ్లి చేసుకున్న వ్య‌క్తిని ఎవ‌రు కూడా స్టార్ హ‌జ్బెండ్ అని అన‌రు.  ఆడ‌వాళ్ల‌ను మాత్ర‌మే స్టార్ వైఫ్ అని ఎందుకు పిలుస్తారు అని మీరా ప్ర‌శ్నించింది.

 బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ భార్య‌ మీరా రాజ్‌పుత్ ఒక యూట్యూబ‌ర్. వీళ్లిద్ద‌రూ ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు.  వీళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. పెళ్లి త‌ర్వాత నుంచి ఆమెను అంద‌రూ స్టార్ వైఫ్ అనడం మొద‌లుపెట్టారు. మీరా యూట్యూబ్‌లో అందం, ఆరోగ్యం గురించి పోస్ట్‌లు పెడుతుంటుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios