మాట తప్పారంటూ.. స్టార్ హీరోయిన్ భార్యపై ఫైర్!

Mira Rajput brutally trolled for endorsing anti-ageing creams
Highlights

తల్లి అయిన తరువాత తన ముఖంలో కొన్ని మార్పులు వచ్చాయని వాటిని ఈ క్రీమ్ తొలగించింది ఈ నా రీబార్న్ స్టోరీ అంటూ తన రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని యాడ్ లో చెప్పుకొచ్చింది

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ని సోషల్   మీడియా వేదికగా కొందరు నెటిజన్లు దూషించడం మొదలుపెట్టారు. మీరు మాట తప్పారు, మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ ఆమెను నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఆమె ఓ యాడ్ లో నటించడమే.. ఇటీవల ఆమె ఓ యాంటీ ఏజింగ్ క్రీమ్ కు సంబంధించిన ప్రకటనలో నటించారు.

ఆ యాడ్ ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తల్లి అయిన తరువాత తన ముఖంలో కొన్ని మార్పులు వచ్చాయని వాటిని ఈ క్రీమ్ తొలగించింది ఈ నా రీబార్న్ స్టోరీ అంటూ తన రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని యాడ్ లో చెప్పుకొచ్చింది. దీనికి స్పందనగా కొందరు నెటిజన్లు.. 'చర్మసౌందర్యం కోసం సహజ సిద్ధమైన ఉత్పత్తులే వాడతానని గతంలో చెప్పిన మీరు ఇప్పుడు మాట తప్పారు.

ఇలాంటి యాడ్స్ లో నటించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి' అంటూ కామెంట్ చేయగా.. 'యాంటీ ఏజింగ్ క్రీమ్ ను ప్రచారం చేయడం ఏంటి.. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను' అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.   

 

loader