థియేటర్‌లో మైనర్ బాలికను అత్యాచారం చేశాడు ఓ కామాంధ యువకుడు

First Published 2, May 2018, 12:20 PM IST
Minor Girl Raped at a theatre in hyderbad
Highlights

థియేటర్‌లో మైనర్ బాలికను అత్యాచారం చేశాడు ఓ కామాంధ యువకుడు

హైదరాబాద్ దారుణం చోటు చేసుకుంది. థియేటర్‌లో మైనర్ బాలికను అత్యాచారం చేశాడు ఓ కామాంధ యువకుడు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సిటీలోని బోరబండ ప్రాంతంలోవుంటున్న ఓ బాలిక ప్రతిరోజూ విజేత థియేటర్‌ ఆవరణలోని నల్లా వద్దకు నీళ్లకి వచ్చేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బాలిక తన వదినతో కలిసి అక్కడికి వచ్చింది. బాలిక వదిన నీళ్లు తీసుకొని వెళ్లగా.. మైనర్ మాత్రం నల్లా వద్దే ఉండిపోయింది.

అదే సమయంలో థియేటర్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల ప్రశాంత్, బాలికను బలవంతంగా కొట్టి లాక్కునిపోయాడు. బాలిక ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. యువతి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశాడు ఈ కామాంధుడు. అనంతరం తప్పించుకున్న బాలిక, పేరెంట్స్‌కి విషయం చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

loader