ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani) నివాళులర్పించారు. తెలుగు అక్షరాలు 56 అని.. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలమని, అలాంటి అక్షరాలతో సిరివెన్నెల పద విన్యాసం చేశారని ప్రశంసించారు. ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేర్ని నాని కొనియాడారు. 

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani) నివాళులర్పించారు. బుధవారం విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన ఫిల్మ్ ఛాంబర్ వద్ద సిరివెన్నెల పార్ధివ దేహానికి నివాళులర్పించి... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. తెలుగు అక్షరాలు 56 అని.. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలమని, అలాంటి అక్షరాలతో సిరివెన్నెల పద విన్యాసం చేశారని ప్రశంసించారు. ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేర్ని నాని కొనియాడారు. తెలుగుజాతి గర్వపడేలా తన కలాన్ని కదిలించిన గీత రచయిత, సాహితీకారుడన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (ap govt), సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) తరపున ఘన నివాళి అర్పిస్తున్నామని.. ‘సిరివెన్నెల’ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 

కాగా.. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

ALso Read:Sirivennela death: కవీశ్వరుడా శివైక్యం అయ్యావా... సిరివెన్నెలకు మిత్రుడు ఇళయరాజా నీరాజనం!

దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. Sirivennela Seetharama Sastry Dead మరణంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురైంది. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్‌ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్‌ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 

మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.