Asianet News TeluguAsianet News Telugu

#Maheshbabu: భార్య పేరుతొ మహేష్ రెస్టారెంట్స్.. డిటేల్స్!

మహేష్ బాబు హోటల్స్ బిజినెస్ కు చెందిన వర్క్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది.  రెండు చోట్ల ఈ హోటల్స్ ప్రారంభించే అవకాశం ఉందని వినికిడి. ఇప్పటికే బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్  ఓపెనింగ్ కి సిద్ధమవుతోంది, 

Minerva, Asian Namrata Opening Soon
Author
First Published Oct 24, 2022, 3:17 PM IST


 సూపర్ స్టార్ మహేష్ బాబు వరస సినిమాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో  వరస యాడ్స్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఆయనలో బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు. మహేష్ బాబు అనేక  వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన ప్రస్తుతానికి ఏషియన్ మహేష్ బాబు మాల్ నిర్వహిస్తున్నారు.  అలాగే ఆయన నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్నారు.  తాను హీరోగా నటిస్తున్న సినిమాల్లో కూడా సొంతంగా పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్  హోటల్ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఈ విషయమై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నిజమే అని తేలింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు హోటల్స్ బిజినెస్ కు చెందిన వర్క్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది.  రెండు చోట్ల ఈ హోటల్స్ ప్రారంభించే అవకాశం ఉందని వినికిడి. ఇప్పటికే బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్  ఓపెనింగ్ కి సిద్ధమవుతోంది, ఏషియన్ నమ్రతా పేరుతో మహేష్ బాబు ఈ హోటల్స్ వ్యాపారం ప్రారంభిస్తున్నారు అని వినిపిస్తోంది.

ఏషియన్ మమత పేరుతో ఒక హోటల్ నవంబర్ లో ప్రారంభం కానుండగా మరొక హోటల్ ప్యాలెస్ హెడ్స్ ఏషియన్ నమ్రతా పేరుతో డిసెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే  చాలామంది సినిమా హీరోలు ఈ హోటల్ వ్యాపారంలో ఉన్నారు, సందీప్ కిషన్, నవదీప్, అల్లు అర్జున్, వంటి వారు కొన్ని బ్రాండ్ల పేరుతో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం తన భార్య పేరుతో అలాగే ఏసియన్ సంస్థ భాగస్వామ్యంతో ఈ హోటల్ బిజినెస్ చేస్తూ ఉండడం ఇంట్రస్టింగ్ గా మారింది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మహేష్ 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ తల్లి మరణించడంతో రెండో షెడ్యూల్ కు గ్యాప్  తీసుకున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు అలాగే నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటినుంచే సినిమా మీద అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios