యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తోంది. తాజాగా నిర్మాతలు ఈ చిత్రాన్ని గురించి ఆశ్చర్యపోయేలా ఓ విషయాన్ని ప్రకటించారు. 

సాహో చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఆ తేదీ వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 30న సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం ఏస్థాయిలో ఉండబోతో క్లైమాక్స్ కి ఖర్చు చేస్తున్న బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది. కేవలం క్లైమాక్స్ ఫైట్ కోసం దాదాపు 70 కోట్లు ఖర్చుచేస్తున్నారట. ఏకంగా 100 మంది ఫైటర్స్ తో ప్రభాస్ పోరాటం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ పెంగ్ జాంగ్ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. 

క్లైమాక్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండడం చలన చిత్రచరిత్రలోనే ఇదే తొలి సారి అని సాహో చిత్ర యూనిట్ చెబుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.