Nayanatara: హీరోలకు సమానంగా... చిరు సినిమా కోసం కోట్లు తీసుకుంటున్న నయనతార!
లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండియాను ఏలేస్తుంది నయనతార. మరి ఆమెకున్న పాపులరీ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంది. కోట్లు డిమాండ్ చేస్తూ... నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.
వరుసగా స్టార్ హీరోల సినిమాలలో చేస్తూ బిజీగా ఉంది నయనతార. ఆమె లేటెస్ట్ గా రజినీకాంత్ తో జతకట్టారు. నయనతార (Nayanatara)హీరోయిన్ గా నటించిన అన్నాత్తే తమిళంలో రికార్డుల మోతమోగిస్తుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న అన్నాత్తే ఈ స్థాయి హిట్ కొట్టడం.. రజినీకాంత్ మేనియాకు నిదర్శనం.మరొక విశేషం ఏమిటంటే గాడ్ ఫాదర్ మూవీలో నయనతార చిరు చెల్లిగా కనిపిస్తారట. చెల్లి పాత్ర కోసం ఇన్ని కోట్లు అంటే అదో రికార్డ్ అని చెప్పుకోవాలి.
ఇక వరుస విజయాల నేపథ్యంలో నయనతార భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారట.చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(Godfather) కోసం ఈమె ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, సినీ జనాలు షాక్ కి గురవుతున్నారు. మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. నాలుగు కోట్లు అంటే, ఇది టూ టైర్ హీరోల రెమ్యూనరేషన్ తో సమానం.
యంగ్ హీరోయిన్స్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న సమంత, రష్మిక, పూజా హెగ్డే సైతం, మూడు కోట్లకు మించి తీసుకోవడం లేదు. అలాంటిది 15 ఏళ్ల క్రితం పరిశ్రమకు వచ్చిన నయనతార ఈ రేంజ్ లో వసూలు చేయడం నిజంగా గొప్ప విషయమే. ఇది అధికారిక సమాచారం కానున్నప్పటికీ, సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ మాత్రం నయనతారనే తీసుకుంటున్నారు.
ఇక నయనతార గతంలో చిరంజీవి (Chiranjeevi) జోడీగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. గాడ్ ఫాదర్ చిరుతో నయనతారకు రెండవ చిత్రం. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. కాగా నయనతార నవంబర్ 18న తన 37వ బర్త్ డే జరుపుకున్నారు. ప్రియుడు విగ్నేష్ శివన్, గ్రాండ్ గా వేడుకలు నిర్వహించారు.