Asianet News TeluguAsianet News Telugu

Varun Tej : వరుణ్ తేజ్ ‘గని’ మూవీలో ఐటెం సాంగ్ కు ఏ హీరోయినో తెలుసా?

Varun Tej : మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ (Varun Tej )‘గని’మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఐటెం సాంగ్ కు ఏ హీరోయిన్ ను ఎంచుకున్నారనే విషయంపై చిత్ర యూనిట్ స్పందింది. టైటిల్ పోస్టర్లను చూస్తుంటే గనిలో వరుణ్ తేజ్ చాలా దూకుడుగా కనిపించనున్నారు.  
 

Milk beauty Tamanna in Gani movie special song
Author
Hyderabad, First Published Jan 12, 2022, 12:02 PM IST

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ గని (Gani) మూవీతో వేగంగా ముందుకు వస్తున్నాడు.  ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయన గద్దల కొండ గణేష్  మూవీతో మంచి సక్సెస్ పొందాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత… గని మూవీలో నటిస్తున్నాడు తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తన నటనా శైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ కథల ఎంపికలో  కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేకను ఇమేజ్ ను తెచ్చుకుంటున్నాడు. తొలి చిత్రాల కథల విషయంలో తడబడ్డా.. తర్వాత మూస కథలకు స్వస్తి పలికాడు. కొత్తదనానికి అర్థమిచ్చేలా వరుణ్ విభిన్న కథలను ఎంచుకోవడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా గని  చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా  ఏప్రియల్ 1, 2022న విడుదల కానుంది. ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ అభిమానులు, సినీ ప్రియులను మెప్పించనున్నారు.  గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా  వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ‘గని’ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు  జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

ఐటెం సాంగ్లో మిల్క్ బ్యూటీ..
అయితే ఈ సినిమాకు సంబంధించి  ఇప్పటికే గని అంథిమ్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి వ్యూవర్ షిప్ ను అందుకుంది. కాగా ఈ సినిమాలో రెండోవ స్పెషల్ సాంగ్ కు మిల్క్ బ్యూటీ తమన్నాను (Tamanna) ఎంచుకున్నట్టు గీతా ఆర్ట్స్ ట్విట్టర్ లో తెలిపింది. ఇప్పటికే పష్ప ది రైజ్ మూవీలో ఊ.. అంటవా మావ ఊఊ అంటవా అని కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ సినిమాలో తమన్నా ‘కొడితే’ టైటిల్ ఉన్న ఐటెం సాంగ్ లో కనిపించనుంది. ఈ సాంగ్ ను జనవరి 15న విడుదల చేయనున్నట్టు  చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.  తమన్నా గతంలో సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో ఆడిపాడి మహేష్ బాబు ఫ్యాన్స్ ను మెప్పించింది. 
వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ గని చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.  
 

 

Follow Us:
Download App:
  • android
  • ios