ప్రముఖ హాలీవుడ్ సిందర్ మైలీ సైరస్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్ నటుడు లయామ్ హెమ్స్‌వర్త్‌తో పదేళ్ల పాటు డేటింగ్ చేసిన మైలీ గతేడాది డిసంబర్ లో అతడిని వివాహం చేసుకొంది. పెళ్లై ఏడాది కుడా కాకుండానే అతడినుండి విడిపోవాలని నిర్ణయించుకుంది.

ఇద్దరూ విడాకులకు అప్లై చేశారు. ఇటీవల మైలీ.. మరో యువతిని ముద్దాడుతున్న ఫోటోలు బయటకి వచ్చాయి. దీంతో భర్తతో మైలీకి మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 

మైలీ తన భర్తను మోసం చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆమె.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవని తెలిపింది.

తనకు స్మోక్ చేసే అలవాటు ఉందని.. కొన్ని విషయాల్లో దురుసుగా వ్యవహరిస్తుంటానని అంతేకానీ అబద్ధాలు చెప్పే అలవాటు లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మైలీ అభిమానులు ఆమెకి మద్దతుగా నిలవగా.. కొందరు మాత్రం ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.