సూపర్ స్టార్ మహేష్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆయన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 


మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (Bill Gates)ని కలవడమే చాలా మంది కలగా ఉంటుంది. ఈ ప్రపంచ కుబేరుడు వరల్డ్ వైడ్ గా వందల కోట్ల అభిమానులను కలిగి ఉన్నారు. దశాబ్దాలు పాటు ఆయన ప్రపంచ నంబర్ వన్ ధనికుడిగా కొనసాగారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ తో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన ఆవిష్కరణలు ప్రపంచ ముఖచిత్రం మార్చేశాయి. అలాంటి బిల్ గేట్స్ మన టాలీవుడ్ స్టార్ ని ఫాలో అవుతున్నారంటే నమ్మడం కష్టమే. అవును ఇది జరిగింది. బిల్ గేట్స్ ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అవుతున్నారు. 

ఇటీవల మహేష్(Mahesh Babu), నమ్రత బిల్ గేట్స్ ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. బిల్ గేట్స్ తో మహేష్ దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ భేటీలో మహేష్, నమ్రత గురించి బిల్ గేట్స్ పలు విషయాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మహేష్-బిల్ గేట్స్ కలవడం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బిల్ గేట్స్ మహేష్ ని ఫాలో కావడం విశేషంగా మారింది. ప్రపంచంలో లక్షల మంది ప్రముఖులు ఉండగా బిల్ గేట్స్ కేవలం 433 మందిని ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. వారిలో మహేష్ ఒకడు. 

ఇక సామాజిక సేవలో వీరిద్దరి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. చాలా కాలంగా బిల్ గేట్స్ .. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి పేదరిక నిర్మూలన, విద్య, వైద్య వంటి మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. వంద కోట్ల డాలర్స్ ఈ ఫౌండేషన్ కి ఇవ్వడం జరిగింది. అలాగే మహేష్ తన స్థాయి మేరకు పేద చిన్నారుల గుండె ఆపరేషన్స్ కి సహాయం చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ మహేష్ ఫౌండేషన్ చేయించింది. 

మరోవైపు మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆయన త్రివిక్రమ్ చిత్రంకి రెడీ అవుతున్నారు. త్వరలో దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నుండి మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో బిజీ అయ్యే సూచనలు కలవు. మహేష్ తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు రాజమౌళి స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన పారిస్ లో గల యూనిట్ ఇమేజ్ అనే ఓ విఎఫ్ఎక్స్ స్టూడియో సందర్శించారు. ఇక మహేష్ మూవీ దాదాపు మూడేళ్లు తెరకెక్కే అవకాశం కాలేదంటున్నారు.