మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో మీటూ వ్యవహారం చల్లబడిపోయింది. అప్పుడెప్పుడో శ్రీరెడ్డి లాంటి ఆర్టిస్ట్ బయటకొచ్చి అగ్ర హీరోలు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో విషయం సీరియస్ అయింది. 

ఈ క్రమంలో ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని వ్యవహారాలను ఆ కమిటీ సెటిల్ చేస్తే.. మరికొన్ని ఆ కమిటీ దృష్టికి వెళ్లకుండానే కొందరు ఇండస్ట్రీ సభ్యులు తప్పించుకున్నట్లు గుగుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ సినిమాలు తీసే ఓ డైరెక్టర్ కి అమ్మాయిల వీక్ నెస్ ఉందట.

ఆయన ఒక అమ్మాయికి తరచూ తన సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తారని, ఇంకా ఆమెకి చాలా ఫేవర్లు చేస్తారని టాక్. ఇలా ఇద్దరి మధ్య కాస్త అండర్ స్టాండింగ్ ఉందట. కానీ ఇద్దరి మధ్య ఏదో సమస్య రావడంతో ఫిర్యాదు చేయాలనుకుందట. అలానే ఆ డైరెక్టర్ తీరుతో విసిగిపోయిన కొందరు మహిళలు కమిటీలో అతడిపై కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నారట. దాదాపు ఫిర్యాదు వరకు వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది.

కానీ అదే సమయంలో ఈ డైరెక్టర్ ఓ టాప్ హీరోతో సినిమా చేస్తుండడంతో ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని.. విషయం కంప్లైంట్ వరకు వెళ్లనివ్వకుండా మధ్యలోనే మేనేజ్ చేశారని సమాచారం. ఈ విషయం గనుక బయటకి వచ్చి ఉంటే సదరు డైరెక్ట్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేది.