వరుస ఫ్లాప్ లలో ఉన్న మెహ్రీన్ ఇప్పటికే బాధలో ఉంటే ఇప్పుడు నిర్మాతకు తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వలేదనే గొడవతో ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కింది.అసలు విషయంలోకి వస్తే.. సుధీర్ బాబుతో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది మెహ్రీన్. ఈ సినిమా పూజా వేడుకలు కూడా జరిగాయి.

కానీ నిర్మాతకు హీరో సుధీర్ కి మధ్య విభేదాలు రావడంతో సుధీర్ బాబు సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో ఆ సినిమా స్క్రిప్ట్ కళ్యాణ్ దేవ్ కి వినిపించి ప్రాజెక్ట్ ఓకే చేసుకుంది రిజ్వాన్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. కళ్యాణ్ దేవ్ ఈ ప్రాజెక్ట్ లోకి రాగానే.. లెక్కలు మారిపోయాయి.

మెహ్రీన్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగివ్వమని నిర్మాతలు అడుగుతున్నారట. కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా చేయనని మెహ్రీన్ చెప్పిందో.. లేక వారు తీసేశారో తెలియదు కానీ మెహ్రీన్ ని అయితే తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వమని అడిగారు.

దానికి మెహ్రీన్ అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఈ గొడవ కాస్త ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్ కి చేరింది. తన కాల్షీట్ లను వృధా చేశారని, రెండు పెద్ద సినిమాల ఛాన్స్ లు పోయాయని మెహ్రీన్ గొడవ చేస్తుందట. ప్రొడ్యూసర్ మాత్రం అడ్వాన్స్ తిరిగి ఇవాల్సిందేనని పట్టిబడుతున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!