2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో సక్సెస్ అందుకున్న మెహ్రీన్ పిర్జాదా 2017 షెడ్యూల్ ని గ్యాప్ లేకుండా సినిమాలతో నింపేసింది. అయితే మొదట్లో మహానుభావుడు - రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత వరుస ప్లాపులను అందుకుంది. అయితే ఈ మధ్య అమ్మడికి సంబందించిన కొన్ని కాంట్రవర్సియల్ న్యూస్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో ఈ వైట్ బ్యూటీ అస్సలు రెస్పాన్స్ లేకుండా వ్యవహరిస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కాజల్ తో ఇటీవల ఈగో క్లాష్ తో కవచం ప్రమోషన్స్ కి వెళ్ళలేదు. ఇక రీసెంట్ గా దిల్ రాజు లాంటి బ్యానర్ లో రెండో అవకాశం ఇచ్చినా కూడా F2 ఆడియో ఈవెంట్ లో పాల్గొనలేదు. 

ప్రస్తుతం న్యూ యార్క్ లో హాలిడేస్ అంటూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే అందుకు సంబందించిన పోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెహ్రీన్ కి అంతగా టెక్కెందుకు అనే కౌంటర్లు కూడా నెటిజన్స్ నుంచి అందుతున్నాయి. మరి మెహ్రీన్ పై వస్తోన్న కథనాలకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం అందుతుందో చూడాలి.