మెహరీన్ ను అవమానించారా.. ఒప్పించారా?

First Published 14, Nov 2017, 5:06 PM IST
mehreen kaur scenes deleted from care of surya tamil version
Highlights
  • సీజన్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మెహరీన్
  • తాజాగా కేరాఫ్ సూర్య సినిమాలో నటించిన మెహరీన్
  • ఈ మూవీ తమిళ వెర్షన్ లో మెహరీన్ సీన్స్ అన్నీ కట్ చేసిన టీమ్
  • మెహరీన్ కు కోలీవుడ్ లో ఇలా జరగటంపై షాక్

తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన యంగ్ హీరోయిన్ ఎవరా అంటే టక్కున గుర్తొచ్చేది మెర్హీన్ కౌర్ పేరే. ఫటాపటా సినిమాలతో వచ్చిన అందాల భామ మెహ‌రీన్ ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిపోయింది.

 

నాని సరసన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమాతో ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ఆమె శ‌ర్వానంద్‌తో మ‌హానుభావుడు, తాజాగా ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ సినిమాల‌తో మూడు వ‌రుస హిట్లు కొట్టి తొలి మూడు సినిమాల‌తోనే హ్యాట్రిక్ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది.

 

తాజాగా మెహ‌రీన్ సందీప్‌కిష‌న్ స‌ర‌స‌న C/o సూర్య సినిమాలో న‌టించింది. కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు అనుకున్న టాక్ రాలేదు. దీంతో ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్‌లో హీరోయిన్ మెహ‌రీన్ ఉన్న సీన్లు అన్ని పూర్తిగా డిలీట్ చేశారని తెలుస్తోంది. అక్క‌డ ఈ సినిమాలో 20 నిమిషాల సీన్లు సోమ‌వారం నుంచి ట్రిమ్ చేశారు. అందులో హీరోయిన్ మెహరీన్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగించారు. 

 

సినిమా టైటిల్స్‌ లో మెహ‌రీన్ పేరున్నా సినిమాలో ఆమె న‌టించిన సీన్లు మాత్రం లేవు. ఈ సీన్లు తీసేముందు ద‌ర్శ‌కుడు ఆమెకు చెప్పిన‌ట్టు సమాచారం. ఇక సినిమా చూసిన వారు మెహ‌రీన్‌కు ప్ర‌యారిటీ లేద‌ని ముందే పెద‌వి విరిచారు. ఇక ఇప్పుడు ఏకంగా త‌మిళ్ వెర్ష‌న్‌లో ఆమె క్యారెక్ట‌ర్ మొత్తం ఎత్తివేయ‌డం కోలీవుడ్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

కాగా మెహరీన్ ఖాతాలో మరో తెలుగు సినిమా వచ్చి చేరింది. మాస్‌ హీరో గోపిచంద్‌ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో మెహరీన్‌ ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చక్రి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాధామోహన్‌ నిర్మిస్తున్నాడు. 

loader