సాధారణంగా ఓ పెద్ద హిట్ పడగానే ఆ టీమ్ మొత్తం బిజీ అయిపోతుంది. ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ పరిస్దితి అయితే చెప్పక్కర్లేదు. లక్కీ హ్యాండ్ అంటూ వాళ్లతో సినిమాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు నిర్మాతలు, దర్శకులు. కానీ ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ ఇచ్చినా మెహ్రీన్ కు మాత్రం ఆ గోల్డెన్ డేస్ రావటం లేదు. అందుకు కారణం తన మేనేజర్, తన తల్లి అని మండిపోతోందట ఆ అమ్మడు. తనకు పీఆర్ సరిగ్గా లేకపోవటం వల్లే ఈ పరిస్దితి అని అర్దం చేసుకుందట. 

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ గర్ల్ మెహ్రీన్ కౌర్. ఇప్పుడు ఆమె కెరీర్ పరిస్థితి అస్సలేం బాగోలేదు. సరైన ఆఫర్ ఒక్కటీ ఆమె గుమ్మం తొక్కటం లేదు. వచ్చిన ఆఫర్స్ ఏమీ పనికొచ్చేవి కాదు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. మెహ్రీన్ కి అవకాశాలు రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తను బరువు పెరగటం వల్లనే అలా జరుగుతోందని ఆఖరుకి వెయిట్ తగ్గినా ఫలితం శూన్యం.  ఎఫ్ 2లో  స్విమ్ సూట్ వేసినా.. మెహ్రీన్ కెరీర్ కు కలిసొచ్చిందేమీ లేదు.  బాలయ్య, గోపీచంద్ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చేసరికి ఆమెకు బెంగ పట్టుకుందట. 

ఇలాంటి సమస్య రావటానికి కారణం ఆమె తన మేనేజరే అని ..రీసెంట్ గా అతన్ని తొలిగించిందట. అలాగే మెహ్రీన్ విషయంలో తల్లి జోక్యం ఎక్కువైపోతోంద‌ని టాలీవుడ్‌లో వినిపిస్తూండటంతో ఆమెపై కూడా కోపం వ్యక్తం చేసిందిట. మరో ప్రక్క ఆమె తల్లి.. ఓ పంజాబీ చిత్రం కమిటైందట. తెలుగుతో పోలిస్తే పంజాబీ మార్కెట్ చాలా చిన్నది. అయినా మన మాతృభాషలో సినిమా చెయ్యకపోతే ఎలా..మనవాళ్లంతా అక్కడే ఉన్నారని చెప్పి ఒప్పించిందట. ఇవన్నీ మనస్సులో పెట్టుకుని అటు మేనేజర్ కు బై చెప్పి, ఇటు తల్లికి ఓ రేంజిలో క్లాస్ పీకి తన ప్రస్టేషన్ తగ్గించుకునే ప్రయత్నం చేసిందట.