ఐఏఎస్ అధికారితో మెహ్రీన్ మాజీ ప్రియుడి నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్
గత కొంత కాలంగా మెహ్రీన్ కి కలసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు బోల్తా కొడుతున్నాయి. అవకాశాలు కూడా తగ్గాయి
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది.
అయితే గత కొంత కాలంగా మెహ్రీన్ కి కలసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు బోల్తా కొడుతున్నాయి. అవకాశాలు కూడా తగ్గాయి. ఆ మధ్యన మెహ్రీన్ తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ని మెహ్రీర్ ప్రేమించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరికి 2021లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్ళికి ముందు వీరిద్దరూ విభేదాల కారణంగా నిశ్చితార్థం, పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు. ఆయా తర్వాత 2022 ఉప ఎన్నికల్లో భవ్య బిష్ణోయ్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.అయితే త్వరలో భవ్య బిష్ణోయ్ వివాహానికి రెడీ అవుతున్నారు. తాజాగా భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ అధికారి పరి బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీనితో మెహ్రీన్ పర్సనల్ లైఫ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.