కంత్రి, భిళ్ళా,షాడో చిత్రాలతో  తెలుగు సినిమాకు స్టైలిష్ దారిని చూపిన మెహర్ రమేష్ అదే స్దాయిలో సక్సెస్ ని మాత్రం చూడలేకపోయారు. కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవటంతో ఆయన వెనక బడిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన శక్తి, వెంకటేష్ తో చేసిన షాడో సినిమాలు ఆయన్ను పూర్తిగా వెనక్కి లాగేసాయి. దాంతో  గ‌త కొన్నాళ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ పట్టబోతన్నారు. 

అయితే ఈ సారి ఆయన సినిమా చేయబోవటం లేదు. అందుతున్న సమాచారం మేరకు  ఓ వెబ్ సీరీస్ ని డైరక్ట్ చేయబోతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కోసం ఆయ‌న ఈ వెబ్‌సీరీస్ చేయ‌టానికి ఎగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వెబ్ సీరిస్ సైతం భారీగా ఉండబోతోందని వినికిడి. ఈ వెబ్‌సీరీస్‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఇక మహేష్ భార్య నమ్రత ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

త్వరలోనే ప్రొడక్షన్స్ కు వెళ్లనుంది. నమ్రత ఓకే చేసిన స్క్రిప్టులలో టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యయన్ కూడా ఉంది. ఈ వెబ్ సీరిస్ కోసం ఎంచుకున్న  స్టోరీ లైన్ సైతం టార్గెట్ ఆడియన్స్ ని బేస్ చేసుకుని రెడీ చేసారంటున్నారు. పేరున్న లాయ‌ర్ ...వుమ‌నైజ‌ర్ అయితే ప‌రిస్థితి ఏంటి? అంటూ ఓ గమ్మత్తైన కాన్సెప్టు చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ వెబ్‌సీరీస్‌ను రూపొందిస్తున్న‌ట్టు వినికిడి. ఈ వెబ్ సీరిస్ తో  పాటు మ‌హేష్ కోసం ఆయ‌న స్క్రిప్ట్ సిద్ధం చేశార‌ట. మహేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మ‌హేష్ కు ఉన్న బిజీలో సినిమా అంటే కష్టమే.