తన భర్త చిరంజీవి సర్జా వాయిస్ విని కన్నీరుమున్నీరైన నటి.. ఎమోషనల్ వీడియో

చిత్ర పరిశ్రమలో ఇటీవల చాలా విషాదకర సంఘటనలు చూశాం. కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతి కూడా అలాంటిదే. కేవలం 36 ఏళ్ల పిన్న వయసులోనే గుండె పోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. 

Meghna Raj gets emotional after hearing Chiranjeevi Sarja voice

చిత్ర పరిశ్రమలో ఇటీవల చాలా విషాదకర సంఘటనలు చూశాం. కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతి కూడా అలాంటిదే. కేవలం 36 ఏళ్ల పిన్న వయసులోనే గుండె పోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. చిరంజీవి సర్జా సతీమణి మేఘన రాజ్ కూడా నటే. 

చిరంజీవి సర్జా మృతి చెందిన సమయంలో మేఘన రాజ్ విషాదాన్ని దిగమింగుతూ ధైర్యంగా నిలబడింది. ప్రస్తుతం మేఘన రాజ్ కన్నడ బుల్లితెరపై డాన్సింగ్ ఛాంపియన్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

మ్యారేజ్ తర్వాత తన భర్త తనకు గిఫ్ట్ గా ఇచ్చిన బహుమతులని అందరి ముందు గుర్తు చేసుకుంది. నెక్ లెస్, హ్యాండ్ బ్యాగ్ ఇలా చిరంజీవి సర్జా మ్యారేజ్ యానివర్సరీ, వాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుకలు చూసి మరోసారి మురిసిపోయింది. 

ఇంతలో షోలో నిర్వాహకులు చిరంజీవి సర్జా పాత వాయిస్ ఆడియో ప్లే చేసారు. తనని విష్ చేస్తూ చెప్పిన మాటలకు మేఘన రాజ్ కన్నీరు ఆపుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ సన్నివేశం షోలో ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మేఘన రాజ్, చిరంజీవి సర్జా 2018లో ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత వీరికి బాబు జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తూ చిరంజీవి సర్జా తన కొడుకుని చూడకుండానే మరణించారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios