ఏ చిత్ర పరిశ్రమలో అయినా హీరోయిన్స్ కి హిట్స్ ఉంటేనే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందం నటనతో ఎంత ఆకట్టుకున్నా కెరీర్ మొదట్లో ఛాన్స్ లు వస్తాయోమో గాని వరుసగా చేసిన సినిమాలన్నీ నీరాశపరిస్తే వారి కెరీర్ దాదాపు ముగిసినట్లే అని చెప్పాలి. కానీ ఒక బ్యూటీ లక్కు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఆమె అందుకుంటున్న అవకాశాలు కూడా మాములుగా లేవు. 

ఆమె ఎవరో కాదు నితిన్ తో లై - ఛల్ మోహన రంగ అంటూ హడావుడి చేసిన మేఘా ఆకాష్. ఆ సినిమాలు దారుణంగా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయినా కూడా మంచి ఆఫర్స్ అందుకుంటోంది.  ఇకపోతే ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ కోలీవుడ్ సుందరికి ఇప్పటివరకు హిట్టు రాలేదు. ధనుష్ తో చేస్తోన్న ఒక సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. నవంబర్ లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక రజిని పెట్టా సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమాను తమిళ్ లో సుందర్ సి రీమేక్ చేస్తున్నాడు. శింబు హీరో. ఆ ప్రాజెక్ట్ లో కూడా మేఘ ఆకాష్ సమంత చేసిన పాత్ర చేయనుంది. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టయినా అమ్మడు స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. మరి ఈ ప్లాప్ సుందరి ఎంతవరకు హిట్స్ అందుకుంటుందో చూడాలి.