లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మేఘా ఆకాశ్ తన నటనతో వరుసగా ఆఫర్లు పట్టేస్తున్న మేఘా నితిన్ తో మరో మూవీ చేస్తున్న మేఘాకు తాజాగా చైతూ తో ఆఫర్

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మేఘా ఆకాష్. ఈ మలయాళీ భామకు ఇప్పుడు తెలుగులో మంచి ఆవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే నితిన్‌తో ఒకసారి కలిసి నటించిన మేఘా ఇప్పుడు మరోసారి నితిన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా మరో యంగ్ హీరో తన సినిమాలో మేఘా ఆకాష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు.

'యుద్ధం శరణం' చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి, మారుతి వంటి దర్శకులతో కలిసి పని చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాల కోసం ప్రస్తుతం హీరోయిన్లను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. చందు మొండేటి సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక మారుతి సినిమా కోసం అను ఎమ్మాన్యూయల్, మేఘా ఆకాష్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఇద్దరిలో చైతు ఓటు మెగా ఆకాష్‌కే అని తెలుస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ చైతుని ఆకట్టుకోవడంతో ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదట చందు సినిమాను పూర్తి చేయాలనుకున్న చైతు ఇప్పుడు మాత్రం మారుతి సినిమాను పూర్తి చేసే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వరుస యాక్షన్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని భావించిన చైతు ఈ సారి వెరైటీ లవ్ స్టోరీ లాంటివి చేస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాడట.