యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్.. నితిన్ లై చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత మేఘా ఆకాష్.. ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, రాజా రాజా చోర లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది.

యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్.. నితిన్ లై చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత మేఘా ఆకాష్.. ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, రాజా రాజా చోర లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోవడం మేఘా ఆకాష్ ప్రత్యేకత. అయితే తాజాగా మెగా ఆకాష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 

మేఘా ఆకాష్ అమ్మమ్మ వృద్దాప్య సమస్యలతో మార్చి 1న మరణించారు. తనని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మ దూరం కావడంతో మేఘా ఆకాష్ కుమిలిపోతోంది. తన బాధని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన హృదయం ముక్కలైంది అంటూ మేఘా ఆకాష్ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 

View post on Instagram

'డియర్ అమ్మమ్మ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. సాయం అంటూ వచ్చిన అందరి కడుపు నింపిన దయామయురాలివి నువ్వు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్.. నువ్వే నా ఫస్ట్ లవ్.. నేను నీతోనే గాసిప్స్ మాట్లాడేది. కానీ ఇకపై నీతో మాట్లాడలేను. నీతో ఎన్నో ఆదివారాలు గడిపాను. ఇకపై ఆయా సరదాలు ఉండవు. నిన్ను మాలోనే చూసుకుంటాం. నీలా ఉండేందుకు ప్రయత్నిస్తాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ మేఘా ఆకాష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన అమ్మమ్మతో గడిపిన మధుర క్షణాల ఫోటోలని మెగా ఆకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.