మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేవని తెలుస్తోంది. 

సినిమా రన్ టైమ్ ఎక్కువవ్వడంతో ఎడిటింగ్ వర్క్ తో బిజీగా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సినిమాలో అనవసర సన్నివేశాలను కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివి ఎక్కువైతే సినిమా టోటల్ రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుందని మెగాస్టార్ ట్రిమ్ చేయిస్తున్నారట. 

అవసరమైతే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన అనంతరం యాడ్ చేసుకోవచ్చని అప్పుడు సినిమాకు ఇంకా ఉపయోగమని అంతా ఒక నిర్ణయానికి వచ్చి భారీ ఖర్చుతో తీసిన సన్నివేశాలను కూడా ట్రిమ్ చేస్తున్నట్లు సమాచారం. హిస్టారికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చిత్ర యూనిట్ ఫాలో అవుతున్న ఈ టెక్నీక్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.