మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మెగాస్టార్ పుట్టినరోజు నేడు. ఈ వేడుకను మెగా అభిమానులు అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఓ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత రామ్ చరణ్ అఫీషియల్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు కు ఒక కొత్త టైటిల్  ప్రకటించారు.

 

అప్పట్లో ఈ సినిమాకోసం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' ఉయ్యాలవాడ' 'రెడ్డన్న వగైరా వగైరా చాలా టైటిల్స్ అనుకున్నారు. బ్రిటీష్ వారితో పోరాడే ఒక వీరుడు గాధగా దీన్ని చెబుతున్నారు కాబట్టి. ఇండియా అంతటా రిలీజ్ చేసుకునే ఛాన్సు ఉంటుంది. అందుకే ఇప్పుడు మొత్తంగా అందిరికీ నచ్చేలా ఉండే టైటిల్ పెట్టాలని ఆలోచించి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేసారు.

 

రకరకాల పేర్లను పరిశీలించాక చివరకు ''సైరా... నరసింహారెడ్డి'' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. 'సై రా' అంటే నేను రెడీ.. ఎస్ అనే తరహా అర్ధాలను మనం ఊహించుకోవచ్చు. పైగా.. తమిళం, హిందీ, తదితర భాషల్లో కూడా అదే టైటిల్ పెట్టేసుకోవచ్చు. అందుకే ఆ టైటిల్ ను చిరంజీవి ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సైరా నరసింహారెడ్డి టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఫస్ట్ లుక్ లో కేవలం చిరంజీవి వెనుకవైపు భాగాన్ని మాత్రమే రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. మరి మెగా స్టార్ ఉయ్యాలవాడ అసలు లుక్ ఎలా వుంటుందోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది.