మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఈ సినిమా కోసం కోట్లాది మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో చిత్ర యూనిట్ కూడా ఆ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని కష్టపడి పని చేస్తోంది. 

63 ఏళ్ల మెగాస్టార్ కూడా సినిమా కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఇక ఇప్పుడు సొంత ఇంట్లో కూడా సినిమా పనులను కొనసాగిస్తున్నాడు. 24 గంటలు సైరా ఆలోచనలతోనే మెగాస్టార్ కాలాన్ని కొనసాగిస్తున్నారు. సైరా సినిమాకు సంబందించిన డబ్బింగ్ పనుల కోసం ఇంట్లోనే మినీ డబ్బింగ్ థియేటర్ ని సెట్ చేసుకున్నారట. 

వివిధ వేరియేషన్స్ లో తనకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఆ తరువాత  ప్రతి సీన్ లో వాయిస్ ని యాడ్ చేస్తూ చెక్ చేసుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటూనే రోజు మెగాస్టార్ తో రెండు గంటల పాటు డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నారట.

వీలైనంత త్వరగా డబ్బింగ్ పనులను పూర్తి చేసి ట్రైలర్ ను ఆగస్ట్ 15కి రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ వేసుకున్నాడు. మరి ఆ ట్రైలర్ అభిమానుల అంచనాలను మరెంత పెంచుతుందో చూడాలి.