మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న తన 65వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు భారీగా సందడికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా బహిరంగంగా భారీ సెలబ్రేషన్స్‌ చేసే అవకాశం లేదు. దీంతో సినిమా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదిక రచ్చ చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ట్విటర్‌ ట్రెండ్స్‌లో రికార్డ్‌లను బ్రేక్ చేస్తున్నారు.

తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బర్త్‌ డే సందర్భంగా అభిమానులు 24 గంటల్లోనే 60.2 మిలియన్ల (6 కోట్లకు పైగా) ట్వీట్లు చేసిన వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈనేపథ్యంలో తాజాగా మెగాస్టార్ అభిమానులు సరికొత్త రికార్డ్‌కు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ బర్త్‌ డే కానుకగా కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు, మెగాస్టార్ 65 వ బర్త్‌ డే కావటంతో 65 మంది సెలబ్రిటీలతో ఒకేసారి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీంతో పాటు చిరు ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించిన లుక్‌ను కూడా రిలీజ్ చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ లూసీఫర్ రీమేక్‌ విషయంలో కూడా పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ హడావిడితో మెగాస్టార్‌ సోషల్ మీడియా వేదికగా సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి.