Asianet News TeluguAsianet News Telugu

వాల్తేరు వీరయ్య 365 డేస్ సెలెబ్రేషన్స్..తమ్ముడు రవితేజ, బాబీ అంటూ చిరు ఎమోషనల్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ కోరుకునే విధంగా మాస్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య చిత్రంతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డైలాగులు, డ్యాన్స్ మొత్తం మునుపటి చిరుని గుర్తు చేశాయి.

Megastar Chiranjeevi voice message on  Waltair veerayya 365 days dtr
Author
First Published Jan 10, 2024, 4:34 PM IST

మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ కోరుకునే విధంగా మాస్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య చిత్రంతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డైలాగులు, డ్యాన్స్ మొత్తం మునుపటి చిరుని గుర్తు చేశాయి. రవితేజ చిరు తమ్ముడిగా కీలక పాత్రలో నటించారు. ఇలా అన్ని అంశాలు కుదరడంతో బాక్సాఫీస్ వద్ద జాతర జరిగింది. వాల్తేరు వీరయ్య చిత్రం 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్ లో 365 రోజుల పాటు ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ రోజుల్లో సినిమాలకు ఇది అరుదైన రికార్డు అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య చిత్రం 365 డేస్ సెలెబ్రేషన్స్ ని ఫ్యాన్స్ ఇటీవలే నిర్వహించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ వాయిస్ మెసేజ్ తో అభిమానులకు చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలిపారు. వాల్తేరు వీరయ్య చిత్రం ఈ రోజుల్లో 365 రోజులు ఆడిందంటే మీకు నామీద ప్రేమ అభిమానం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది. అందుకు కృతజ్ఞతలు. 

ఈ రికార్డుకి కారణం ఈ చిత్రాన్ని మీకు నచ్చేలా తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ, నా తమ్ముడు రవితేజ, దేవిశ్రీ ప్రసాద్ అలాగే మైత్రి మూవీస్ సంస్థ అని చిరంజీవి అన్నారు. మీ అందరికి హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు. 

వాల్తేరు వీరయ్య చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. ప్రశాంత్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. అలాగే తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో మెరిశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios