మరో రెండు రోజులలో మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి రూపంలో భారీ వేడుక జరగనుంది. నిహారిక మరియు జొన్నలగడ్డ చైతన్య వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ నందు గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే నాగబాబు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైపోయింది. నిన్న నిహారిక తన తల్లి పద్మజ 32ఏళ్ల క్రితం నిశ్చితార్ధ వేడుకలో ధరించిన చీరను కట్టుకున్నారు. స్కై బ్లూ కలర్, బంగారు అంచు కలిగిన ఆ చీరలో నిహారిక అద్భుతంగా ఉన్నారు. 

పెదనాన్న చిరంజీవి నిహారికతో సెల్ఫీ దిగారు. కొత్త పెళ్లి కూతురితో చిరు సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో నాగబాబు పంచుకోగా వైరల్ అవుతుంది. నాగబాబు ఆ ఫొటోకు ' ఆయన ప్రేమ...సమయం, వయసు అనే సరిహద్దులు దాటింది. ఆయన చిరు నవ్వు ప్రతి క్షణం వేడుకలా మారుస్తుంది' అని ఓ ఎమోషనల్ నోట్ పెట్టాడు. అలాగే చిరంజీవి నిహారికకు పెళ్లి గిఫ్ట్ గా కోటి రూపాయలకు పైగా విలువైన వస్తువును సిద్ధం చేశారట. 

ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగనున్న పెళ్లి వేడుకకు మెగా కుటుంబం మొత్తం హాజరు కానుంది. చరణ్, అల్లు అర్జున్ తమ షూటింగ్స్ కి విరామం ప్రకటించి నిహారిక వెడ్డింగ్ కి సతీసమేతంగా హాజరుకున్నారట. సాయి ధరమ్ కూడా ఈ పెళ్ళికి హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దీనితో పెళ్ళికి ఖచ్చితంగా పవన్ హాజరయ్యేలా నాగబాబు ఏర్పాట్లు చేశారట.