‘సైరా’ సినిమా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా అని తెలిసిందే.  ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసారు. ఈ షూట్ కోసం సుమారు వందమంది విదేశీ జూనియర్ ఆర్టిస్టులను సమీకరిస్తున్నారు అని టాక్. అయితే ఈమూవీ షూటింగ్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం అయినా ఒకపదిరోజులు వరసగా ఆసినిమా షూట్ చేసి ఆతరువాత ఆమూవీ షూటింగ్ ను ఆపేసి పూర్తిగా ఆషూటింగ్ ఫుటేజ్ పరిశీలిస్తారట.

 

ఈసినిమా షూటింగ్ ప్రారంభం ఒకభారీ ఫైట్ సీన్ తో ప్రారంభం అవుతోందట. అందువల్ల డూప్ లు లేకుండా భారీ ఫైట్స్ చేస్తున్న చిరంజీవికి ఎటువంటి సమస్యా లేకుండా కొంతమంది నిష్ణాతులైన విదేశీ ఫైట్ ట్రైనర్స్ ను రంగంలోకి దింపి ఈ ఫైట్స్ కంపోజ్ చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

 

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గెటప్ అన్నివిధాలా సరిపోయిందా లేదా అన్న దానిపై కూడ డిఫరెంట్ ఒపీనియన్లు చిరంజీవి సన్నిహితులు కొంతమంది ప్రముఖ దర్శకులకు చూపెట్టి అన్నివిధాల సంతృప్తి కలిగితేనే తిరిగి షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ చేస్తారని టాక్. లేదంటే ఆ ఫుటేజ్ అంతా పక్కనపడేసి చిరంజీవి గెటప్ లో  కావాల్సిన ఛేంజెస్ చేసి మళ్లీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

 

దీనికితోడు ప్రముఖ అమెజాన్ సంస్థ ‘సైరా’ సినిమా షూటింగ్ మేకింగ్ విడియోలను తమద్వారా విడుదల చేయడానికి తన ఎక్విప్ మెంట్ తన సిబ్బందితో ఏర్పాటు చేస్తోందని అంటున్నారు. ఇలా అమెజాన్ ఈసినిమా మేకింగ్ వీడియోలను తయారు చేసినందుకుగాను కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చే విధంగా ఈసినిమాను నిర్మిస్తున్న మెగా క్యాంప్ అమెజాన్ ల మధ్య ఒక ఒప్పందం కూడ కుదిరింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. సో 200 కోట్లకు పైగా భారీ బడ్జట్ తో తెరకెక్కనున్న సైరా మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు శుభవార్తే.