Asianet News TeluguAsianet News Telugu

సైరా టాప్ 5 హైలైట్స్

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే యుఎస్ లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సైరా చిత్రంలోని హైలైట్స్ గురించి తెలుసుకుందాం..   

Megastar Chiranjeevi SyeRaa movie top 5 highlights
Author
Hyderabad, First Published Oct 2, 2019, 4:40 AM IST

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే యుఎస్ లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సైరా చిత్రంలోని హైలైట్స్ గురించి తెలుసుకుందాం..   

మొదటగా మాట్లాడుకోవలిసింది స్టోరీ లైన్ గురించి. కథ చాల బలంగా ఉంది. ఎమోషన్స్ కు బాగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఒక ప్యాకేజీ లాగా మదర్ సెంటిమెంట్ నుంచి మొదలుకొని దేశభక్తి వరకు అన్ని ఎమోషన్స్ తో నిండుగా పవర్ ఫుల్ గా ఉంది. తమన్నా దాదాపుగా నవరసాలను పలికించింది. చాలా పాత్రల చుట్టూ కథ తిరుగుతున్నా, ఎక్కడా ప్రేక్షకుడు కనెక్టివిటీని మిస్ అవడు. 

చిరంజీవి మొదటి హైలైట్ గా మనకు కనపడ్డా, అలనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి కథను తొలి హైలైట్ గా పేర్కొనవలిసి వచ్చింది. చిరంజీవి 60ఏళ్ల వయసులోనూ, కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఫుల్ ఎనర్జిటిక్ గా కనపడ్డారు. ఎమోషనల్ సీన్స్ లో చిరంజీవి పెర్ఫార్మన్స్ న భూతో న భవిష్యత్. ముఖ్యంగా నయనతార, తమన్నాలతో తనకు ఉన్న రేలషన్ షిప్ ని షోకేస్ చేసేప్పుడు చిరంజీవి చూపెట్టిన నటన అమోఘం. 

మూడవ హైలైట్ గా చెప్పుకోవాలిసింది ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి. ఒకింత స్లో నరేషన్ లో సినిమా సాగుతుందేమో అనుకునే టైం లో వచ్చే ఈ బ్యాంగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. కోయిల్ కుంట్ల కోశాగారం పై దాడి సన్నివేశంలో చిత్రీకరణ అదిరిపోయింది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్  ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, అభిమానులు సినిమా సెకండ్ హాఫ్ లో ఏమన్నా మిస్ అవుతామేమో అని సీట్లకే అతుక్కుపోయేంత. ఇంతలా ఉండడం వల్ల చిత్రం సెకండ్ హాఫ్ పై ఆసక్తి మరింతగా పెరుగుతుంది. 

ఇక నాలుగవ హైలైట్ గా చెప్పుకోవాలిసింది సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్. చిరంజీవి ని బ్రిటీషువారు చుట్టుముట్టినప్పడినుండి మొదలు సినిమా చూస్తున్న ప్రేక్షకులు పూర్తిగా లీనమైపోయి నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏలుబడిలో ఉన్న ప్రజలైపోతారు. ప్రతి ఫ్రేములోను తమని తాము ఊహించుకుంటారు. నరసింహారెడ్డి ని ఉరితీసే సీన్ చాల బాగా హ్యాండిల్ చేసారు. ఎక్కడా చిరంజీవి పాత్ర చనిపోయింది అని అనిపించదు. మాతృదేశం బానిస శృంఖలాలు తెంచడానికి ఒక యోధుడు ప్రాణతర్పణం చేసాడనిపించి మన రోమాలు నిక్కబొడుస్తాయి. 

ఇక 5వ హైలైట్ గా చెప్పుకోవాలిసింది యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ. ఫస్ట్ హాఫ్ లో జాక్సన్ ను ఎదిరించినప్పడినుంచి మొదలు నొస్సం కోట యుద్ధం, ఆతరువాత జరిగే యుద్ధం టాప్ లెవెల్ లో ఉన్నాయి. యుద్ధాలను అంత భారీ స్థాయిలో తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో డిఒపి ఎంత రిచ్ గా ఉందంటే, హాలీవుడ్ సినిమాను చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. 

వీటితోపాటు చిత్రాన్ని ఆదినుంచి కూడా నిలబెడుతూ, ఎక్కడా డ్రాప్ అవ్వనివ్వకుండా చూసేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఒక రకంగా సినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. కేవలం రెండు పాటలతోని దాదాపు మూడుగంటల చిత్రాన్ని నడిపించడం అంటే కత్తిమీద సామే. సురేందర్ రెడ్డి ఈ విషయంలో విజయవంతమయ్యాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఒకింత స్లో నరేషన్ అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకుపోతుంది. 

సో, సైరా నరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సునామీని చూసేందుకు సిద్ధంకండి . 

Follow Us:
Download App:
  • android
  • ios