నేడు బ్రదర్స్ డే నేపథ్యంలో మెగాస్టార్ తనదైన శైలిలో విషెస్ తెలిపారు. తన చిన్ననాటి అరుదైన ఫోటో పంచుకున్న చిరంజీవి 'తోడ బుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి... హ్యాపీ బ్రదర్స్ డే! అంటూ ట్వీట్ చేశారు.


గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుండి చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ, చిత్ర ప్రముఖులు, హీరోలకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ, సామాజిక విషయాలపై స్పందిస్తూ పోస్ట్స్ పెడుతున్నారు. లక్షల్లో ఫాలో అవుతున్న మెగా ఫ్యాన్స్ చిరంజీవి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ చేస్తూ ఉంటారు. 


కాగా నేడు బ్రదర్స్ డే నేపథ్యంలో మెగాస్టార్ తనదైన శైలిలో విషెస్ తెలిపారు. తన చిన్ననాటి అరుదైన ఫోటో పంచుకున్న చిరంజీవి 'తోడ బుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి... హ్యాపీ బ్రదర్స్ డే! అంటూ ట్వీట్ చేశారు. 13-14ఏళ్ల ప్రాయంలో ఉన్న చిరంజీవి... తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చంకలో ఎత్తుకొని ఉన్నాడు. మరో తమ్ముడు నాగబాబు చిన్న స్మైల్ ఇస్తూ ఫోటోకి ఫోజిచ్చాడు. 

బాల్యంలో దిగిన ఈ మెగా బ్రదర్స్ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. అప్పటి చిరంజీవిని చూస్తే వెండితెరను తిరుగులేకుండా ఏలిన హీరో ఈ బాలుడేనా అన్న భావన కలుగుతుంది. మరో వైపు ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా ప్రభావం లేకుండా సమ్మర్ కానుకగా ఆచార్య ఈపాటికే విడుదల అయ్యేది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ మరో కీలక రోల్ చేస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

Scroll to load tweet…