మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ..సినీ పరిశ్రమ బాధలను సీఎంలు పట్టించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ..సినీ పరిశ్రమ బాధలను సీఎంలు పట్టించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో అందరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని.. నలుగురైదుగురు మాత్రమే తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. నలుగురైదుగురి కోసం అందరినీ ఇబ్బంది పెట్టొద్దని చిరు స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విపత్తు వచ్చిన ముందుగా స్పందించేది సినీ పరిశ్రమేనని మెగాస్టార్ గుర్తుచేశారు.
నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదని.. వీళ్లు బాగున్నారు కదా! సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ విషయం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించిందని.. నాలుగైదు నెలలు షూటింగ్స్ ఆగిపోయే సరికి, కార్మికులు అల్లాడిపోయారని మెగాస్టార్ గుర్తుచేశారు. హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి కార్మికుల కోసం నిత్యావసర సరకులు అందించామని.. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయని చిరంజీవి తెలిపారు.
