Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘భోళా శంకర్’ షూటింగ్ రీస్టార్ట్.. ఆ భారీ సెట్ లో చిత్రీకరణ!

మెగాస్టార్ చిరంజీవి  - మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళాశంకర్’. తాజాగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించింది. ఈరోజు షూటింగ్ తిరిగి ప్రారంభించినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. 
 

Megastar Chiranjeevi's Bhola Shankar movie shooting restart nsk
Author
First Published Jan 17, 2023, 2:58 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న `భోళాశంకర్‌` (Bhola Shankar) అప్డేట్స్ షురూ అయ్యాయి. ప్రస్తుతం చిరు ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బాస్టర్ సక్సెస్ వైబ్ లో ఉన్నారు.  ఇదే జోష్ లో తన నెక్ట్స్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రూపొందిన `వేదాళం`కి రీమేక్‌ గా వస్తోందీ చిత్రం. మాస్‌ మసాలా యాక్షన్‌ కామెడీగా దీన్ని రూపొందిస్తున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా నటిస్తోందని సమాచారం. 

ఇక మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైందని చిత్ర యూనిట్ అప్డేట్ అందించింది. హై పాజిటివ్ ఎనర్జీతో మెగా బ్లాక్‌బస్టర్ పండుగ వైబ్‌ను కొనసాగిస్తూ.. ఏకే ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మాత రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభైంది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఏర్పాటు చేయించిన కోల్‌కతా సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణ మొదలైంది. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ‘భోళా శంకర్‌’పై అంచనాలు చాలా పెరుగుతున్నాయి. మెహర్ రమేష్ చిరంజీవిని స్టైలిష్ గా,  మరింత మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. డడ్లీ కెమెరా బాధ్యతలు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను ఆయా పాత్రల్లో అలరించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios