ఘనంగా ఎన్టీఆర్ హీరోయిన్ కార్తీక పెళ్లి, చిరంజీవి తో సహా హాజరైన పలువురు సెలబ్రిటీలు
అలనాటి హీరోయిన్ రాధ కుమార్తె.. యంగ్ హీరోయిన్ కార్తీక పెళ్ళి నేడు ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యింది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక..పెద్దగా అవకాశాలు సాధించలేకపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేక పోయింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.
వరుణ్ ను ఫాలో అవుతున్న వైష్ణవ్ తేజ్, ఆహీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడా..?
ఇక రీసెంట్ గా తన పెళ్ళికి సబంధించిన హింట్ ఇచ్చిన బ్యూటీ.. చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. తాను ప్రేమించి రోహిత్ మీనన్ ను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు అప్పుడే తెలిపిన ఆమె.. తాజాగా రోహిత్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది.
కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో కనిపించి సందడి చేశారు. చాలా కాలం తరువాత వీరు కలవడంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్ళి మండపంలో సినీ తారలతో వాతావరణం సందడిగా మారింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
తమిళంలో పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు.
ఇక ఈ పెళ్లికి మెగాస్టార్ హాజరు కావడానికి కూడా ఓ కారణం ఉంది. కార్తీక తల్లి రాధ.. మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు చేసింది. సీనియర్ హీరోయిన్ రాధ గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక సినిమాల్లో నటించని రికార్డ్ ఆమెది. రాధ అప్పట్లోనే గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది. 80,90 దశకాల్లో రాధ వరుసగా హిట్ సినిమాల్లో నటించింది.