మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ..? వెబ్ సిరీస్ కు సైన్ చేసిన చిరంజీవి...?
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇండస్ట్రీకి షాకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నారట. డిజిట్ ఫ్లాట్ ఫామ్ మీద దుమ్మురేపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక వివరాల్లోకి వెళ్తే..?
రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నారు. కొత్త దర్శకులు, యంగ్ స్టార్స్ కు అవకాశాలు ఇవ్వడం. రీమేక్ కథలను ఇష్టంగా చేయడం.. ఇలా సినిమాల విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ ఈ విషయంలో కాస్త తడబడ్డారు కూడా. అంతే కాదు మంచి కథ దొరికితే.. డిజిటల్ ప్లాట్ ఫామ్ కురావడానికి అయినా సిద్దం అని గతంలో చెప్పినట్టుగానే తాజాగా చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బుల్లితెరపై ఒకసారిసందడి చేశారుచిరంజీవి. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో ఓసీజన్ కు హోస్ట్ గా చేశారు. ఆతరువాత మళ్ళీ బుల్లితెరవైపు చూడలేదు మెగాస్టార్. ఇక తాజాగా ఆయన ఓటీటీ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అనుకున్నట్టుగానే మంచి స్క్రిప్ట్ దొరకడంతో డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి రావడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట తెలుస్తోంది దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న చిరు మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి ఇంప్రెషన్ చూపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆయన ఓటీటీ ఎంట్రీకి సబంధించిన వివరాలు అఫీషియల్ గాతెలియాల్సి ఉంది.
ఆ హీరో వల్ల కన్యత్వం కోల్పోయాను.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..
ఇక తాజాగా మెగాస్టార్ నటిస్తున్న మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలుఉన్నాయి. తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు టీమ్. ఈసినిమాను 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పురాణాలు ఢీకొట్టినప్పుడు లెజెండ్స్ ఉద్భవిస్తారు.. అనే క్యా్ప్షన్ పోస్టర్‌లో కనిపిస్తుండగా.. చిరు స్టైలిష్ వాక్‌తో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న విశ్వంభరకు.. ఆర్‌ఆర్‌ఆర్ ఫేం.. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో...మెగా 156 గా వస్తోంది విశ్వంభర.