మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు మరో ఐదు సినిమలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్న మెగాగాస్టార్...ఒక సినిమా కోసం ఏకంగా 50 కోట్లు వదులుకోబోతున్నాడట. ఇంతకీ ఏ సినిమా..? ఏంటా కథ.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఆచార్య రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు మరో ఐదు సినిమలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్న మెగాగాస్టార్...ఒక సినిమా కోసం ఏకంగా 50 కోట్లు వదులుకోబోతున్నాడట. ఇంతకీ ఏ సినిమా..? ఏంటా కథ.
మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఐదు సినిమాల తో బిజీ బిజీగా ఉన్న స్టార్ హీరో..ఊపిరి మెసలకుండా పనిలో మునిగిపోయి ఉన్నాడు. ఏజ్ బార్ అయిపోయి.. ఆరుపదులు దాటిని మెగాస్టార్.. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఒక్కొ సినిమాకు దాదాపు 50 కోట్లు తీసుకుంటున్నాడు మెగా హీరో. అయితే ఆయన ఓ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండ పని చేయడానికి రెడీ అయ్యాడట.
మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఇండస్ట్రీలో ఒకరిగా కొనసాగుతుంది. ఆమె చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా, స్టైలీష్ట్ గా, ప్రోడ్యూసర్ గా కొనసాగుతుంది. ఇక ఆమె కూడా తన తండ్రి చిరుతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాకాంలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సుష్మిత భారీ సినిమా చేసే ప్రయత్నంలో ఉందట.
ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈక్రమలోనే తాజాగా మెగాస్టార్ కోసం సుష్మిత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను ప్లాన్ చేశారు కాని..ఇంకా డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదట. అయితే ఈ విషయంలో మెగాస్టార్ కూడా తన కూతురికి భారీ గిప్ట్ ప్లాన్ చేశారట. ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు న్యూస్ హల్ చల్ చేస్తోంది.
దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తన కూతురికోసం ఏకంగా 50 కోట్లు వదులుకోవడానికి రెడీ అయ్యాడట చిరంజీవి. మరి ఈసినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు. ఎవరెవరు నటిస్తారు. ఈకధేంటి..? ఇవన్నీ తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.
ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ఈనెల 29న రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ శేర్ చేసుకున్న ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈమూవీలో చిరంజీవి జోడీగా కాజల్, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
