పడి లేస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఫెయిల్యూర్ బాధలో ఉన్న పూరీ.. అంతకు రెండింతలు స్పీడ్ తో దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాడు.
మెగా సినిమాపై కష్టపడి కసరత్తులు చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక పూరీ పని అయిపోయింది అనుకున్న వారికి.. రెట్టింపు స్పీడ్ తో పైకి లేచి చూపిస్తున్నాడు దర్శకుడు. లైగర్ తో గట్టి దెబ్బ తిన్న పూరి.. మెగా సినిమా కోసం పక్కా ప్లాన్ ను రెడీ చేసుకుంటున్నాడు.
పూరి జగన్నాథ్ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడుతూనే ఉన్నాడు. ఆయన పనైపోయిందని అనుకున్నవారికి హిట్ తో సమాధానం చెబుతూనే వస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో దూసుకొచ్చిన పూరీకి..పాన్ ఇండియా లెవల్లో..తెరెక్కిన లైగర్ సినిమా గట్టిగా దెబ్బ కొట్టింది. ఈ సినిమా ఫెయిల్యూర్ బాగా ఇబ్బంది పెట్టింది పూరీని.
ఇంతకంటే పెద్ద షాకులే తగిలాయి పూరీకి... వాటి నుంచి కోలుకోవడం ఎలానో నేర్చుకున్న స్టార్ డౌరెక్టర్.. లైగర్ షాక్ నుంచి కూడా త్వరగానే కోలుకున్నాడు. ఇక మెగా ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టే పనిలో పడ్డాడు. మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు పూరీ జగన్నాథ్.
చిరంజీవితో పూరీ జగన్నాథ్ గతంలో ఆటోజాని సినిమా చేయాలనుకున్నాడు. కాది అది పట్టాలెక్కలేదు. ఇక ఎప్పటి నుంచో పూరీతో సినిమా చేయాలని మెగాస్టార్ కూడా అనుకుంటున్నాడు. దీనికి సబంధించి చిరంజీవి.. పూరీని అడిగాడు కూడా. అయితే మరో కొత్త కథ.. అద్భుతమైన కథతో వస్తానంటూ చిరంజీవికి మాట ఇచ్చాడట పూరి.
ఇక రీసెంట్ గా మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు పూరీ జగన్నాథ్. చిరంజీవి కోరిక మేరకు తప్పక నటించినా.. మెప్పించాడు కూడా. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే తన సినిమాకు సబంధించిన వివరాలు కూడా మాట్లాడేసుకున్నారట ఇద్దరు. పూరీ కథను సానపెట్టే పనిలో ఉన్నాడుట.
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నెల 13న సంక్రాంతి కానుకగా ఈమూవీ రిలీజ్ కాబోతోంది. ఆతరువాత మోహర్ రమేష్ కాంబోలో భోళా శంకర్ సినిమా చేయబోతున్నాడు చిరు. ఆతరువాత అనుకున్న వెంకీ కుడుముల సినిమా కాన్సిల్ అయినట్టు వార్తలొచ్చాయి. మరి ఏం జరిగిందో తెలియదు.
అయితే బోళా శంకర్ తరువాత మెగాస్టరా్ ముందుగా పూరితో చేయాలనీ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన కథపైనే పూరి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
