మెగాస్టార్ మలేసియా టూర్, ఓ పదిరోజులు అక్కడే మకాం వేయనున్న చిరంజీవి టీమ్
మెగాస్టార్ ఫారెన్ ట్రిప్ కురెడీ అవుతున్నారు. లాంగ్ షెడ్యూల్ కోసం మలేసియా ప్లానింగ్ లో ఉన్నారు చిరు. మరి ఏ సినిమా కోసం ఆయన వెళ్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారు..? మెగా ప్లానింగ్ ఏంటీ...?
ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా గాడ్ ఫాదర్, మెహర్ రమేశ్ భోళాశంకర్ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Mega 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వాల్తేర్ వీరయ్య అనే మాసీ టైటిల్‌దాదాపు ఖాయం అయినట్టే అని తెలుస్తోంది.
షూటింగ్ స్పీడ్ గా చేస్తున్న మూవీ టీమ్.. టైటిల్ ను కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నారట. వాల్తేర్ సముద్ర తీరం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మరో విషేషం ఏంటీ అంటే.. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. దాదాపు 20 ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ స్క్రీన్ శేర్ చేసుకోబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో చిరు మత్స్యకారుల నాయకుడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ను పక్కాగా ప్లాన్ చేశారట. దీనికోసం మూవీటీమ్ చిరూతో సహా. మలేషియా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చేపల్ని గ్లోబల్ గా విక్రయించే కొన్ని సీన్స్ ఉంటాయట. దాని కోసం విదేశాల్లో కొన్ని సీన్స్ తెరకెక్కించాలట. అందుకే ఈ సినిమా యూనిట్ మలేసియా పయనం కానున్నారని సమాచారం. మలేసియాలో దాదాపు పది రోజులు షూటింగ్ జరగబోతున్నట్టు తెుస్తోంది. ఈ మలేసియా షూటింగ్ తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను వెంటనే ప్లాన్ చేశాడట డైరెక్టర్.
మలేసియా షూటింగ్ తరువాత హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్‌లో కీ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అందరివాడు తరువాత చాలా కాలానికి మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీమామ తర్వాత బాబీ డైరెక్షన్ లో రానున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమా గురించి మరో వాదన ఇండస్ట్రీలో నడుస్తోంది. ఒక సీక్రెట్ మిషన్ లో భాగంగా ఇందులో మెగాస్టార్ మత్స్యకారుడిగా కనిపిస్తాడని, నిజానికి చిరంజీవి అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని వినికిడి. రవితేజ పాత్ర కోసమే ఆయన అండర్ కవర్ కాప్ అవతారం ఎత్తుతాడని తెలుస్తోంది.