యంగ్ హీరోకి మెగాస్టార్ సపోర్ట్!

megastar chiranjeevi is chief guest for geetha govindam prerelease event
Highlights

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' సినిమాను ప్రమోట్ చేసిన తనవంతు సహాయం అందించాలని అనుకుంటున్నారు

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' సినిమాను ప్రమోట్ చేసిన తనవంతు సహాయం అందించాలని అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ తో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతడు నటించిన 'గీతగోవిందం' సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఈ సినిమా ఆడియో విడుదల వేడుక జరిగింది. దానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చి ఫంక్షన్ ని హిట్ చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మెగాహీరోల సపోర్ట్ దక్కుతోంది. ఇప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేయనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని సమాచారం. సినిమాపై హైప్ మరింత క్రియేట్ చేయాలని అల్లు అరవింద్.. మెగాస్టార్ ని రంగంలోకి దింపుతున్నారు.

వైజాగ్ లో ఈవెంట్ కాబట్టి గంటా శ్రీనివాసరావు  వంటి రాజకీయనాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి వైజాగ్ లో జరగబోయే ఈ ఈవెంట్ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి!  

loader