KBCలో చిరంజీవి..? అమితాబ్ ను ప్రత్యేకంగా విష్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి.. కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళబోతున్నారా..? ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చిరు వెల్లడించారా..? తాజాగా బిగ్ బీ గురించి ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముంది..? అసలు సంగతి ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి.. కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళబోతున్నారా..? ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చిరు వెల్లడించారా..? తాజాగా బిగ్ బీ గురించి ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముంది..? అసలు సంగతి ఏంటి..?
ఇండియాకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయితే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి కనిపిస్తే.. ఆడియన్స్ కు పండగే మరి. ఇప్పటికే ఈ ఇద్దరు మెగాస్టార్లు సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి సందడి చేశారు. ఇక మరోసారి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది పెద్ద వార్త.. అది కూడా పండగలాంటి వార్త అనే చెప్పాలి. సైరా తరువాత మరోసారి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని సమాచారం. అసలుఇందులో నిజం ఎంత..?
KBCలో మెగాస్టార్ చిరంజీవి.. వింటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటే.. ఆ ఎపిసోడ్ ఎంత గొప్పగా ఉండాలి.. అవును ఈ విషయం చెప్పకనే చెప్పారు మెగాస్టార్. డైరెక్ట్ గా చెప్పకుండా చిన్న హింట్ ఇచ్చాడు. ఈరోజు అమితాబ్ పుట్టినరోజు కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కూడా అమితాబ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఈ శుభాకాంక్షలుతో పాటు మరో న్యూస్ ని కూడా చెప్పాడు చిరు.
అమితాబ్ బచ్చన్ హిందీలో కౌన్ బనేగా క్రోర్‌పతి (KBC) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో చిరంజీవి పాల్గొనబోతున్నాడట. చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నేను నా ఇన్‌స్పిరేషన్ అయిన అమితాబ్ ని KBC షోలో ఈ రోజు నైట్ వర్చ్యువల్ గా కలుసుకోబోతున్నాను అంటూ తెలియజేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అమితాబ్ తో చిరు ఎపిసోడో ఎలా ఉంటుందా అంటూ అంతా వెయిట్ చేస్తున్నారు.
కాగా చిరంజీవి కూడా ఈ ప్రోగ్రామ్ తెలుగు వెర్షన్ ను హోస్ట్ చేశారు. బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి అయితే.. తెలుగులో మాత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో కింగ్ నాగార్జున ఈ షో స్టార్ట్ చేశారు. ఇక ఈషోని మెగాస్టార్ చిరంజీవి కూడా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోకి కూడా తెలుగులో మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హోస్ట్ లు కలిసి ఈ షోలో కనిపించబోతున్నారు అని తెలియడంతో.. ఈ షోలో ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.