మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అవకతవకలు జరుగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా ప్రజల డబ్బుని తినేస్తున్నారని.. ఆయనకి మరికొంతమంది సభ్యులు సహకరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 'మా'  అసోసియేషన్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. శివాజీరాజా వర్గం మేము మోసం చేయలేదని అంటుంటే.. నరేష్ టీమ్ నిజ నిర్ధారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.

అసోసియేషన్ లో సమస్యలు తలెత్తిన సమయంలోనే దీన్ని సామరస్యంగా పరిష్కరించాలని పెద్దలు అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు వర్గాలు మీడియాకెక్కాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాదంలోకి ఆయన్ని లాగడం పట్ల ఆయన హర్ట్ అయ్యారని సమాచారం.

మా అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ అయిన మెగాస్టార్ వద్దకు ఈ విషయం వెళ్లినప్పుడు కొంత సమయం తీసుకొని గొడవలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించాలనుకున్నారు. కానీ ఇప్పుడు విషయం పెద్దది కావడం పైగా అతడిపై నెగెటివ్ వార్తలు రావడంతో కొందరి సభ్యులపై ఆయన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అలానే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో చిరంజీవిని టార్గెట్ చేస్తూ వడ్డించిన కథనాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోపక్క ఎలాంటి సంబంధం లేని చిరంజీవిని ఈ వివాదంలోకి లాగడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు అంటున్నారు.