Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడికి అండగా చిరంజీవి, దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తనతో కలిసి చిన్నతనం నుంచి చదువుకున్న స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని.. స్నేహితుడికి ఆపన్న హస్తం అందించాడు. 

Megastar Chiranjeevi Helps His Childhood Friend JmS
Author
First Published Oct 22, 2023, 5:29 PM IST


సహనటుడు కాని.. స్నేహితుడు కాని... బందువు కాని.. అభిమాని  కాని.. ఎవరైనా సరే.. కష్టాల్లో ఉన్నాడు అని తెలిస్తే.. పరుగు పరుగున వెళ్ళి ఆదుకుంటాడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా చిరంజీవి తన చిన్నప్పటి స్నేహితుడు ఆరోగ్యం విషయం తెలుసుకొని వెంటనే  స్పందించాడు.  తనస్నేహితుడికి ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత ఉన్నా.. తన మిత్రుడికి మంచి ట్రీట్మెంట్  అందాలని వెంటనే హైదరాబాద్ కు రప్పించాడు.. అపోలోలో జాయిన్ చేయించాడు. 

మొగల్తూరులో చిన్ననాటి మిత్రుడు అయిన పువ్వాడ రాజా అనారోగ్యంతో కొంతకాలంగా బాధ పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. స్నేహితుడిని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తీసుకు వచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు. అంతే కాదు దగ్గరుండి స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యావేక్షిస్తున్నాడు.. తాజాగా చిరంజీవి హాస్పిటల్ కి వచ్చి స్నేహితుడిని పరామర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు. అలాగే డాక్టర్ తో మాట్లాడి స్నేహితుడు ఆరోగ్య పరిస్థితిని డీటెయిల్‌గా తెలుసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

గతంలో కూడా తన అభిమానులకు ఇలానే కష్టాల్లో ఉన్నవారికి ట్రీట్మెంట్ చేయించారు మెగాస్టార్. ఇక తనతో కలిసి నటించిన పొన్నం బలం ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి చెన్నై అపోలో హాస్పిటల్ లో 40 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందేలా చేశాడు. ఇక తమిళనాట కష్టాల్లో ఉన్న నటి పాకీజాను కూడా మెగా బ్రదర్స్ ఆదుకున్నారు. ఇక తాజాగా తన స్నేహితుడికి సహాయం అందించాడు. ఇవి చూసిన అభిమానులు.. చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన  నిజంగా దేవుడు అని కొలుస్తున్నారు. 

 ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ . ప్రస్తుతం Mega157కోసం రెడీ అవుతున్నాడు.  బింబిసార సినిమాతో హిట్ కొట్టిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.వచ్చే నెల ఈమూవీ సెట్స్ మీదకు వెళ్తుందని సమా

Follow Us:
Download App:
  • android
  • ios