హనుమంతుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, క్రేజీ న్యూస్ లో నిజం ఎంత..?

హానుమంతుడిగా నటించిన మెగాస్టార్ చిరంజీవి. వింటానికి ఇది నిజమా అని అనిపిస్తుంది కదు.. అయితే ఇది నిజమే అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఓమూవీలో కొద్ది సేపు ఆయన ఈ పాత్రలో కనిపించబోతున్నారట. 
 

Megastar Chiranjeevi Hanuman character In Teja Sajja Hanuman Movie  JMS

మెగాస్టార్ చిరంజీవితో పాటు.. మెగా ప్యామిలీ అంతా హనుమన్ భక్తులు.. ఆ విషయం తెలిసిందే. వారిప్రొడ్షన్ హౌస్ పేరు కూడా అంజనా ప్రొడక్షన్స్ అని ఉంటుంది. ఈక్రమంలో ఆంజనేయుడంటే వారికి ఎంత ఇష్టమోతెలుస్తోంది. ఇక అటువంటి హనుమంతుని పాత్ర.. అది కూడా గెస్ట్ రోల్ వస్తూ.. మెగాస్టార్ చేయకుండా ఉంటారా..? తాజాగా ఒక సినిమాలో ఆయన కొద్దిసేపు అనుమంతునిగా కనిపించబోతున్నారు అని గుసగుసలు వనిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత..? 

త్వరలో రిలీజ్ కాబోతోంది హనుమాన్‌ సినిమా. ఈసినిమా కోసం  తెలుగు ఆడియాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిసెంట్ గాి వచ్చిన  ట్రైలర్‌ ఆ క్యూరియాసిటీని.. సినిమాపై  అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో యంగ్ హీరో  తేజా సజ్జా నటిస్తున్నాడు. బడా హీరోలకు ఢీకొట్టడానికి..  సంక్రాంతి సినిమాల పోటీని రసవత్తరంగా మార్చడానికి ఏమాత్రంభయపడుకుండా..  బరిలో దిగుతున్నాడు హనుమాన్. సంక్రాంతికి అంత పెద్ద సినిమాలు ఉన్నా.. ఈసినిమాను రంగంలోకి దింపుతున్నాడంటేనే..  ఈ సినిమాపై ప్రశాంత్‌ వర్మ ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతోంది. ట్రైలర్‌ చివరలో భజరంగ్‌ ఎంట్రీ షాట్‌ అయితే మైండ్‌ బ్లోయింగ్‌ అనే చెప్పాలి.  

Megastar Chiranjeevi Hanuman character In Teja Sajja Hanuman Movie  JMS

అయితే ఈసినిమా ట్రైలర్ లో చివరిగా హనుమంతుడు కండ్లు తెరిచే సన్నివేశం ఉంటుంది. ఈసీన్ చూసినప్పుడు ఒళ్లు పులకరిస్తుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటోందో ఈ ట్రైలర్ చూశాక తెలుస్తోంది. ఈక్రమంలో ఈసినిమా క్లైమాక్స్ లో కొద్ది నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుందని అంటున్నారు. అయితే ఆ హనుమ పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించారని సమాచారం. సర్ ప్రైజింగ్ గా ఈపాత్రనురివిల్ చేయాలని టీమ్ ప్లాన్ చేశారట. ఇది కూడా అఫీషియల్ గా తెలిసింది కాదు కాని..సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. 

ఇక ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని..  సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వార్ బాగా వైరల్‌ అవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ఆంజనేయుడి వీర భక్తుడు. గతంలో  ఆయన తన కెరీర్ కు బ్లాక్ బస్టర్  ఇచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కాసేపు హనుమంతుడిలా కనిపిస్తాడు. అలాగే యానిమేషన్‌ సినిమా హనుమాన్‌లోనూ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. వీటన్నింటినీ చూస్తే హనుమాన్‌లోనూ ఆంజనేయుడి పాత్రలో చిరంజీవి నటించే ఉంటారనే ఫ్యాన్స్ ఫిక్స అయ్యి ఉన్నారు.అదే కనుక జరిగేతే.. మెగా మ్యానియాలో ఈమూవీ భారీహిట్ కొట్టే అవకాశం ఉంది. కాని ఇది నిజమా లేక రూమర్ ఆ.. అనేది వారు అఫీషియల్ గా ప్రకటిచే వరకూ తెలియదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios