చైనాలో 80లలో దక్షిణాది సినీ పరిశ్రమల్లో పనిచేసిన స్టార్స్ గెట్టు గెదర్ ప్రతి యేటా 80 దశకం స్టార్ నటీనటుల గెట్టు గెదర్ ఈ సారి చైనాలో ప్లాన్ చేసుకున్న స్టార్ గ్యాంగ్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఆయనతోపాటు దక్షిణాదికి చెందిన చాలామంది టాప్‌స్టార్స్ ప్రస్తుతం చైనాలోనే ఉన్నారు. 80వ దశకంలో దక్షిణాదిన వెండితెరపై మెరిసిన టాప్‌స్టార్స్ అంతా ప్రతీ ఏడాదీ ఏదో ఒక ప్రాంతంలో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
మొన్నటి వరకు అలాంటి పార్టీలు హైదరాబాద్, చెన్నై, కోచి తదితర ప్రాంతాల్లోనే జరిగేవి. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో జరుగుతోంది. ఈ పార్టీ కోసం ఇప్పటికే చిరంజీవితోపాటు సుహాసిని, ఖుష్బూ, రాధిక, శరత్‌కుమార్, భాగ్యరాజా వంటి నటులు చైనా చేరుకున్నారు. భారత్‌లో ఉంటే సెక్యూరిటీ మధ్య ఉండే స్టార్స్ అంతా చైనా వీధుల్లో స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ గెట్టు గెదర్ కారణంగానే మెగాస్టార్ తో పాటు పలువురు సీనియర్ స్టార్లు దర్శకరత్న దాసరి కడసారి వీడ్కోలుకు హాజరు కాలేకపోయారు.
