MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు

కిరణ్‌ అబ్బవరం తాజాగా `చెన్నై లవ్‌ స్టోరీ` మూవీతో వచ్చాడు. ప్రీమియర్స్ తో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లని సాధించింది. మరి ఎంత రాబట్టిందనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 25 2026, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా ఆకట్టుకుంటున్న చెన్నై లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా ఆకట్టుకుంటున్న చెన్నై లవ్‌ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం ఒకప్పుడు స్ట్రగుల్‌ అయ్యాడు. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. `క` మూవీతో ఆయన కెరీర్‌ మారిపోయింది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్‌ అయ్యాడు. `కే ర్యాంప్‌`తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పుడు `చెన్నై లవ్‌ స్టోరీ`తో రచ్చ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలు చేశాడు కిరణ్‌, లవ్‌ స్టోరీస్‌, థ్రిల్లర్స్ చేశాడు. కానీ ఇది పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం. ప్రేమ తప్ప ఇంకేమీ లేదని చెప్పొచ్చు. దర్శకుడు కావాలనుకునే ఒక అనాథ కుర్రాడి ప్రేమ కథ. అదే సమయంలో పీఠలమీదే పెళ్లి ఆగిపోయిన అమ్మాయి రెండో ప్రేమ కథ. ఆద్యంతం ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. ఇటీవల కాలంలో వచ్చిన మరో  కొత్త రకమైన ప్రేమకథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ప్రేమ కథ చెన్నై లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ప్రేమ కథ చెన్నై లవ్‌ స్టోరీ

గురువారం ప్రీమియర్స్ తో ఈ సినిమా ప్రారంభమైంది. పెయిడ్‌ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూత్‌కి సినిమా బాగా నచ్చింది. టీనేజర్ల నుంచి, కాలేజీ స్టూడెంట్స్ వరకు అందరు బాగా చూస్తున్నారు. వారికి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా లవ్‌ బ్రేకప్‌ అయిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. వాళ్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. మరి ఈ సినిమాకి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం దుమ్ములేపుతున్నాడని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌
Related image2
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
35
చెన్నై లవ్‌ స్టోరీ కలెక్షన్లు
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ కలెక్షన్లు

ఈ సినిమాకి పెయిడ్‌ ప్రీమియర్స్ ద్వారానే రూ.3.13కోట్లు రావడం విశేషం. సాక్నిల్క్ లెక్క ప్రకారం  మొదటి రోజు(శుక్రవారం) ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. రూ.4.40కోట్ల నెట్‌, ఐదు కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో దీనికి రెండున్నర కోట్లు వచ్చాయి. మొత్తంగా ఇది రూ.7.56కోట్లు రాబట్టింది. టీమ్‌ చెప్పే లెక్కల ప్రకారం ఎనిమిది కోట్లకుపైగానే వచ్చిందని సమాచారం. ఏదేమైనా ఇది కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.

45
చెన్నై లవ్‌ స్టోరీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

చెన్నై లవ్‌ స్టోరీ మూవీకి సుమారు రూ.15కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. దీనికి రూ.23కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ గా లెక్క కట్టారు. ఓటీటీ రూపంలో మరో నాలుగు కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూపంలో ఐదు కోట్లు వచ్చాయి. సినిమా థియేట్రికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.45కోట్ల వరకు వసూలు చేయాలి. ఇప్పుడు ఉన్న టాక్‌ ప్రకారం మూవీ రెండోవారంలో ఆ టార్గెట్‌ని రీచ్‌ అవుతుందని చెప్పొచ్చు. యూత్‌కి కనెక్ట్ అయితే మాత్రం ఇది పెద్ద రేంజ్‌లో కలెక్షన్లని రాబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

55
నటనతో దుమ్ములేపిన కిరణ్‌ అబ్బవరం, గౌరీ ప్రియ
Image Credit : Asianet News

నటనతో దుమ్ములేపిన కిరణ్‌ అబ్బవరం, గౌరీ ప్రియ

`చెన్నై లవ్‌ స్టోరీ`లో కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించారు. త్రిగుణ్‌ కీలక పాత్రలో మెరిశారు. రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ఎంటర్‌టైన్‌మెంట్స్, మాస్‌ మూవీ మేకర్స్ పతాకాలపై ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్‌ నిర్మించారు. ధీరజ్‌ మొగిలినేని సహ నిర్మాత. ఈ చిత్రానికి సాయి రాజేష్‌ కథ అందించడం విశేషం. ఈ మూవీ కథ పరంగా, స్క్రీన్‌ ప్లే పరంగా కొత్తగా ఉంటుంది. ఒక మంచి ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. కిరణ్‌ అబ్బవరం తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫెర్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్‌ సీన్లలో ఇరగదీశాడు. ఇక ఈ మూవీకి హీరో అంటే గౌరీ ప్రియ అనే చెప్పాలి. ఆమె పాత్ర ప్రధానంగానే కథ నడుస్తుంది. ఇందులో ఆమె నటన అదిరిపోయింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Related Stories
Recommended image1
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌
Recommended image2
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved