MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌

Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌

తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ నటించిన `జన నాయకుడు` మూవీ గురువారం విడుదలైంది. రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, ఆశ్చర్యకరమైన వసూళ్లు వచ్చాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 25 2026, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లో జన నాయకుడు సందడి
Image Credit : Asianet News

థియేటర్లో జన నాయకుడు సందడి

దళపతి విజయ్‌ నటించిన చివరి మూవీ `జన నాయకుడు`(జన నాయగన్‌). ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో చివరగా ఈ సినిమాలో నటించారు. ఇప్పుడు ఆయన ఏకంగా తమిళనాడుకి సీఎం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరిలోనే సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సింది. కానీ సెన్సార్‌ వివాదం వల్ల వాయిదా పడింది. సినిమాల్లో రాజకీయ విమర్శలున్నాయనే నేపథ్యంలో సెన్సార్‌ వాళ్లు ఆపేశారు. దీంతో ఇన్ని రోజులు డిలే అయ్యింది. ఎట్టకేలకు జులై 23న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. తెలుగులో పెద్దగా స్పందన లేదు. కానీ తమిళనాడులో మాత్రం అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌ అభిమానులకు ఎమోషనల్‌ ఫిల్మ్ జన నాయకుడు
Image Credit : Asianet News

విజయ్‌ అభిమానులకు ఎమోషనల్‌ ఫిల్మ్ జన నాయకుడు

విజయ్‌ నటించిన చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులకు ఇది ఒక ఎమోషనల్‌ మూమెంట్‌గా చెప్పొచ్చు. దీనికితోడు చివర్లో వీడియో కూడా విడుదల చేశారు. ఇది మరింత భావోద్వేగానికి గురి చేసింది. ఈ క్రమంలో మరి దళపతి చివరి సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే ఆశ్చర్యకరమైన వసూళ్లు వస్తున్నాయి. ఓ రకంగా విజయ్‌కి పెద్ద షాక్‌ అనే చెప్పాలి. మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నాయి, కానీ రెండో రోజు భారీగా పడిపోయాయి.

35
జన నాయకుడు మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

జన నాయకుడు మూవీ కలెక్షన్లు

ట్రేడ్‌ సైట్ల లెక్కల ప్రకారం `జన నాయకుడు` మూవీ రెండు రోజుల్లో రూ.112.50కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ.21.15కోట్లు రాబట్టింది. ఇందులో ఓవర్సీస్‌లోనే పది కోట్లు వచ్చాయి. ఇండియాలో ఇది రూ.75కోట్లు రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ.37.50కోట్లు వసూలు చేసింది. అక్కడ ఈ మూవీకి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కానీ ఇండియాలోనే డల్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.128కోట్లు వచ్చినట్టు టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయ్‌ `లియో`, `గోట్‌` మూవీస్‌ ఓపెనింగ్‌ని దాటలేకపోవడం గమనార్హం. దీనికి కారణాలున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే లీక్‌ అయ్యింది. ఆ కాపీనే ఏకంగా కోటి మంది చూశారట. అలా పైరసీలో చూడటంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడిందని టాక్‌. రెండో రోజు కలెక్షన్లు తగ్గడానికి కూడా అదే కారణం.

45
జన నాయగన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌, సక్సెస్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

జన నాయగన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌, సక్సెస్‌ టార్గెట్‌

మరి `జన నాయగన్‌` మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఎంత రాబట్టాలనేది చూస్తే, ఈ సినిమాకి రూ.240కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ అయ్యిందట. తమిళనాడు, కేరళా కలుపుకొని రూ.120కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.10కోట్లు, కన్నడలో 20కోట్లు, నార్త్ లో ఆరు కోట్లు, ఓవర్సీస్‌లో రూ.80కోట్ల మేరకు బిజినెస్‌ అయ్యిందట. ఈ లెక్కన ఇది థియేట్రికల్‌గా రూ.240కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. అంటే ఐదు వందల కోట్ల గ్రాస్‌ చేయాలి.

55
జన నాయకుడు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్
Image Credit : Asianet News

జన నాయకుడు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్

ఇక నాన్‌ థియేట్రికల్‌ రైట్స్  రూపంలో ఈ మూవీకి భారీగానే వచ్చాయి. ఓటీటీ రైట్స్ రూ.110కోట్లు, ఆడియో రైట్స్ రూ.35కోట్లు, శాటిలైట్‌ రూపంలో మరో రూ.25కోట్లు వచ్చాయట. ఇలా రిలీజ్‌కి ముందే ఈ మూవీకి సుమారు రూ.400కోట్ల వరకు వచ్చాయి. సినిమాకి అయిన బడ్జెట్‌ సుమారు రూ.500కోట్లు. థియేట్రికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.500కోట్ల కలెక్షన్లు రావాలి. నిర్మాత సేఫ్‌ కావాలంటే రూ.600-700కోట్లు రావాలి. కానీ ఆ మేరకు సాధ్యమేనా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లు చూస్తే కష్టమనే టాక్‌ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Recommended image2
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image3
3rd Week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్, 15 లక్షలతో మిథిలేష్‌ జంప్‌.. లక్‌ అంటే వీళ్లదే
Related Stories
Recommended image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Recommended image2
Tanuja: కళ్యాణ్‌ పడాల, పవన్‌ సాయి, ఎంఎం విషయంలో దారుణంగా ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved