మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)నిజంగా స్టార్ అనిపించుకున్నారు. అటు సినిమాలు.. ఇటు ఇండస్ట్రీ.. మరో వైపు ఫ్యామిలీ.. ఇలా అన్ని బాధ్యతలతో పాటు.. అభిమానుల కష్టసుఖాలు కూడా చూసుకుంటున్నారు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)నిజంగా స్టార్ అనిపించుకున్నారు. అటు సినిమాలు.. ఇటు ఇండస్ట్రీ.. మరో వైపు ఫ్యామిలీ.. ఇలా అన్ని బాధ్యతలతో పాటు.. అభిమానుల కష్టసుఖాలు కూడా చూసుకుంటున్నారు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అభిమానులు ఉన్నారు అని అనిపించుకోడమే కాదు. వారి బాగోగులు కష్టసుఖాలు కూడా చూసుకోవడంతో ఆయనకు సాటి ఎవరూ రారు అనిపించుకుంటున్నారు. ఎప్పటకప్పడు అభిమానుల్లో ఎవరు ఎలా ఉన్నారు. ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని.. కష్టాల్లో ఉన్నవారికి సమయానుగూణంగా సహాయం చేస్తూ.. చేయూతనిస్తున్నారు.
మెగా అభిమాన సంఘాల ద్వారా ఎప్పటకప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారో తెలుసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఇక రీసెంట్ గా తన వీరాభిమాని కూతురు పెళ్లి అని తెలుకుని అతినికి ఆర్ధిక సాయం అందించారు మెగాస్టార్. వివరాల్లోకి వెళ్తే రాజం కొండలరావు అనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ఎన్నో ఏళ్లుగా వీరాభిమాని . ఎన్నో సార్లు చిరంజీవిని కలిసిశాడు కూడా.
ఆయన ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక ఈ మధ్యే కొండలరావు కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే ఆయన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ విషయాన్ని చిరంజీవి(Megastar Chiranjeevi) అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అభిమానులు అంటే చెయి ఊపడం..కనిపించి ఇంట్లోకి వెళ్లిపోవడం వరకే కాదు. వారి బగోగులు.. కష్టసుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి.. వారికి ఏ కష్టమొచ్చినా అభిమాన స్టార్స్ అందగగా నిలవాలి అని ప్రాక్టికల్ గా నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. (Megastar Chiranjeevi)
ప్రస్తుతం చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో జోరు పెంచారు. వరుసగా నాలుగు సినిమాలు సెట్స్ ఎక్కించిన మెగాస్టార్.. మరో రెండు సినిమాలు అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య(Acharya) రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 29న ఈమూవీ రిలీజ్ కాబోతోంది.
