Chiranjeevi| "మాటలు రావడం లేదు.." : 'పద్మ విభూషణ్' వరించిన వేళ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..
Chiranjeevi: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్ (Padma Vibhushan)కు ఎంపిక చేసినందుకు చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు
Chiranjeevi: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations)సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఐదుగురు పద్మ విభూషణ్, 17 మంది పద్మ భూషణ్ తో పాటు 110 మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. పద్మవిభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడంతో భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తాను తెలియడం లేదని అన్నారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు.. నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను నేడు ఈ ఉన్నత స్థితిలో ఉంచాయనీ, తనకు దక్కిన గౌరవం తనను ఆదరించేవారిదన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటూఎమోషనల్ అయ్యారు.
తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో నిత్యం వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ.. అభిమానులకు వినోదం పంచుతున్నాననీ, తన శక్తి మేర ఎంటర్టైన్ చేస్తున్నననీ చిరంజీవి అన్నారు. అలాగే తన నిజ జీవితంలోనూ అపదలో ఉన్నావారికి తనకు తోచిన సాయం చేస్తున్నానన్నారు. తనపై మీరు( అభిమానులు) చూపిస్తున్న కొండంత ప్రేమకు తాను ప్రతిగా ఇస్తున్నది గోరంతనేననీ, తనకు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుందనీ అన్నారు. ఇలాంటి అవార్డులతో తనని ప్రోత్సహిస్తుండటంతో తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని అన్నారుచిరంజీవి. తనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.మెగాసార్ట్ కు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ వీడియోను రిపోస్టు చేస్తున్నారు.