అమితాబ్ ను కలిసిన పవన్ కల్యాణ్.. బిగ్ బీ కోసం రోల్స్ రాయిస్ కార్

megastar chiranjeevi arranges rollsroyce for amithab bachan
Highlights

అలా బిగ్ బీని రాయల్ గా చూసుకున్నాడు మెగాస్టార్.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఎక్కడకి వెళ్లినా ఘనస్వాగతాలు, అతిథి మర్యాదలు లభిస్తాయి. సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బసచేసిన హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్ వరకు ఆ కారులోనే ప్రయాణించారట.

 

షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లో వున్నన్ని రోజులు బాలీవుడ్ మెగాస్టార్ కు మన మెగాస్టార్ చిరు అద్భుతమైన ఆతిధ్యం అందించారని తెలుస్తోంది. అమితాబ్ హైదరాబాద్ లో ఉన్న సందర్భంగా చిరు తన రోల్స్ రాయిస్ కారుని బిగ్ బి కోసం ఇచ్చారట. అమితాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా చిరు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట.

 

అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. సైరా చిత్రంలో అమితాబ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రని సైరా నరసింహారెడ్డి గా చిత్రీకరిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

 

అమితాబ్ బచ్చన్ ని ఆయన బస చేసిన హోటల్ లో సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ కలుసుకున్నట్లు సమాచారం. గురువారం రోజు పవన్ కళ్యాణ్ అమితాబ్ ని కలుసుకున్నారని సమాచారం.

 

ఇక అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇటీవల సైరా చిత్రంలోని ఓ పిక్ ను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ రాజ గురువు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ లుక్ మరియు సైరా గెటప్ లో మెగాస్టార్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే... పోరాట యోధుడు నరసింహారెడ్డిగా చిరు వేరే గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

loader