Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి, రవితేజ మాస్ ఎంట్రీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో పూనకాలు మొదలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది.

Megastar chiranjeevi and raviteja entry at pre release event
Author
First Published Jan 8, 2023, 8:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలసి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇచ్చారు. మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో వీరిద్దరూ కనిపిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి చేరుకోగానే ఇద్దరూ వేదికపైకి వెళ్లి చేతులు కలిపి అభిమానులకు అభివాదం చేశారు. 

దీనితో అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. ఇక ప్రీరిలీజ్ వేడుకలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. దర్శకుడు బాబీ.. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని, రవితేజపై ఉన్న ప్రేమని కలగలిపి ఈ చిత్రాన్ని తీశాడు. ఫారెన్ లో ఉన్న తనకు తెలిసిన వాళ్లంతా జనవరి 13న ఆఫీస్ లకు సెలవు పెట్టేశారు. వాల్తేరు వీరయ్య కోసం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios