ఖుష్బూకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి భారీ స్కెచ్ వేశారు. ఇందుకు చిరు ఖుష్బూకు తెలియకుండా అనసూయను సీక్రెట్ గా కలిశాడు. ఆ తర్వాత ఖుష్బూ ఊహించని విధంగా సర్ ప్రైజ్ అయ్యింది. ఇంతకీ ఏమైందంటే?..   

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు యాడ్ ఫిల్మ్ లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ (Sukumar) ఇటీవల పుష్ఫ (Pushpa) మూవీతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ఫ : ది రూల్ పార్ట్ 2పై ఫోకస్ పెట్టాడు. మరికొద్ది రోజుల్లో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే పుష్ఫ క్రేజ్ తర్వాత ఇటు ప్రొఫెషనల్ యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాడు సుక్కు. ఈ మేరకు శుభగృహ Subhagruha రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు. ఈ ప్రకటన చిత్రంలో చిరంజీవి, ఖుష్బూ (Kushboo), అనసూయ కూడా నటించింది.

తాజాగా, ఈ యాడ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రకటన చిత్రంలో.. చిరంజీవి, ఖుష్బూ భార్యా భర్తలుగా, అనసూయ (Anasuya) శుభగృహ ఏజెంట్ గా యాక్ట్ చేశారు. అయితే ఖుష్బూ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇందుకు అనసూయను ఓ అపార్ట్ మెంంట్ వద్ద ఖుష్బూకు తెలియకుండా అనసూయను కలుస్తాడు. అనుమానంతో ఖుష్బూ కూడా చిరు వెనకాలే వస్తుంది. చిరు-అను ను ఫాలోఅవుతూ వాళ్లు వెళ్లిన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ వారిద్దరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే.. చిరు ఖుష్బూ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి బహుకరిస్తారు. తన సొంతింటి కలను నెరవేర్చినందుకు ఖుష్బూ ఆనందబాష్పాలతో సంతోషం వ్యక్తం చేస్తుంది.

YouTube video player

అయితే, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యాడ్ ఫిల్మ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముగ్గురితోనే కమర్షియల్ యాడ్ చేయడం.. అందులోనూ ప్రతి ఒక్కరి ఎమోషన్ ను చూపించడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికన సుకుమార్ డైరెక్షన్ ను చాలా ఎంజాయి చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు చిరు ఏక కాలంలో మూడు చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న గాడ్ ఫాదర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 కూడా సెట్స్ పై ఉంది. వీటితో పాటు వెంకీ కుడుమలతో ఓ మూవీ ఓకె చేశారు.